Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ 21 వరకు కొనసాగిందని ఎంసీపీఐ(యూ)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న అన్నారు.పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధపోరాట వార్షికోత్సవసభను జిలా ్లకేంద్రంలోని భీంరెడ్డినర్సింహారెడ్డి విగ్రహం వద్ద సోమవారం జిల్లా కార్యదర్శి షేక్నజీరు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోరాటంలో సామాన్య ప్రజలు,రైతులు గ్రామీణ ప్రాంతా ల్లోని చేతి వత్తులు,బడుగు,బలహీనవర్గాలకు చెందిన వారికి సుమారు లక్షలఎకరాల భూస్వాముల భూములను పేదలకు పంచిపెట్టారని వెల్లడించారు. ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయకార్యదర్శి ఏపూరి సోమన్న, నాయకులు నలుగురి రమేశ్, వేముల పెద్ద నర్సయ్య, మోరపాక ఉగ్రయ్య, మీసాలసైదులు, కందుకూరి యాదగిరి, లింగంపల్లిరాజు, లింగంపల్లి యోగానందం, అన్వర్, నసీర్ పాల్గొన్నారు.