Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేజీకేఎస్ జిల్లా కార్యదర్శిబొలగాని జయ రాములు గౌడ్
నవతెలంగాణ -రాజాపేట
కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ.5వేల కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలగాని జయ రాములు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఆ సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సొసైటీకీి ఐదెకరాల భూమి ఇవ్వాలని ఉన్న 560జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. 50 ఏండ్లు పైడిన వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోని నాలుగేండ్లు అయినప్పటికీ ఇప్పటికీ మంజూరు చేయలేదన్నారు. ప్రమాదం జరిగిన వారికి ఇస్తున్న ఎక్స్గ్రేషియాలో చాలా జాప్యం జరుగుతుందన్నారు. వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గీత బంధు ఇవ్వాలని , సొసైటీకి ఐదెకరాల భూమి ఇచ్చి, నీరా పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా గోప గాని యాదగిరి, గౌరవ సలహాదారునిగా చమ కూర గోపాల్ ,అధ్యక్షులుగా పాండవుల లక్ష్మణ్్, కార్యదర్శిగా బత్తి ని సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా, దొంకెన పాండు, భీమగని గోపాల్, గడ్డం వెంకటేష్, బోంగొని నర్సింలు,సహాయ కార్యదర్శి బొమ్మ గాని నర్సింలు, బొమ్మ కంటి శ్రీనివాస్, నరేష్, , కొరకొప్పుల ఆంజనేయులు, కళ్ళెం నర్సయ్య, గుల్లపల్లి లక్ష్మి కార్యవర్గ సభ్యులుగా ఐలి శ్రీశైలం బిక్షపతి,రాజులను ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం జిల్లా సహాయ కార్యదర్శి దూ పటి వెంకటేష్, మండల పరిషత్ అధ్యక్షురాలు గోపగాని బాలమని యాదగిరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షడు నమిలే మహేందర్ ,మండల అధ్యక్షుడు పాండవుల లక్ష్మణ్,మండల కార్యదర్శి బత్తిని సత్య నారాయణ, చిలివెరు బాలరాజు గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, బొంగొని ఉప్పలయ్య,నమిలే కేదరి, దోంకెన పాండు, బీ మాగాణి రాములు, బస్వరాజు, ఉపసర్పంచ్ జంపయ్య, బండకింది బాలరాజు, బొంగోని నర్సింలు, గడ్డం వెంకటేశ్, కోరి కొప్పుల అంజయ్య ,తదితరులు పాల్గొన్నారు.