Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య
నవతెలంగాణ - భువనగిరి
వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంపు, ఉచిత విద్యుత్ సాధన కోసం రాష్ట్ర వ్యాపితగా ఉద్యమాలు చేస్తామని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఏం అడివయ్య హెచ్చరించారు. జిల్లాకేంద్రంలో ఆ సంఘం జిల్లా విస్తత స్థాయి సమావేశం పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో జిల్లా అధ్యక్షులు సురపంగ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారన్నారు. వీరిలో కేవలం 4.83 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు.. ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డు లేని ప్రతి వికలాంగులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాపితంగా 15.5కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. ప్రతి నిమిషానికి 11మంది ఆకలితో మరణిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి అర్ వెంకటేష్, జిల్లా కార్యదర్శి వణం ఉపేందర్, జిల్లా కోశాధికారి బి స్వామి, జిల్లా నాయకులు లలిత, శంకర్, అంజన్ శ్రీ, రుభేన్, మల్లయ్య, నాగార్జునా, శ్రీనివాస్, బాలరాజు, యాదయ్య, అన్వర్ పాష, నర్సింహ పాల్గొన్నారు.