Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా సహాయకార్యదర్శి గుంటోజు శ్రీనివాస్‌చారి విమర్శించారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో గంగదేవి సైదులు అధ్యక్షతన సంఘం మండలకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మికులకు నష్టం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. అనేక పోరాటాల ఫలితంగా 2005లో సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని బలహీనపర్చుతుందన్నారు. నేటికీ కూలీలకు పనికి తగ్గ వేతనం లేదన్నారు. కనీస వేతనాలు అమలుచేయడం లేదన్నారు. కొలతల ఆధారంగా కూలి ఇవ్వడంతో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, ఉపాధిహామీ పనులకు నిధులు పెంచి కూలీలను ఆదుకోవాలని, నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. నేడు భువనగిరిలో నిర్వహించనున్న సంఘం జిల్లా వర్క్ షాప్‌ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం మండలకార్యదర్శి బొజ్జ బాలయ్య, ఊషయ్య, యాదయ్య పాల్గొన్నారు.