Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలను వెల్లడించిన డీసీపీ కె.నారాయణ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్టు డీసీపీ కే.నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరిలోని డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం గ్రామం, మండలంకు చెందిన మహాలిచ్చాలురావు 2017 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం 39 దొంగతనాల కేసుల్లో నేరస్థుడు. దొంగతనం కేసుల్లో రాజమండ్రి జైలులో శిక్షను అనుభవిస్తూ ఈ ఏడాది జూన్2న జైలు ఎస్కార్ట్ సిబ్బంది కండ్లుగప్పి తప్పించుకున్నాడు. జైలు నుంచి విడుదలై మూడు నెలల వ్యవధిలో 23 చోరీలకు పాల్పడ్డాడు. మహా లిచ్చాలురావు సొంత జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన గోపే వెంకటేష్, కళ్యాణపు పందిరసాయి, అక్షరుకుమార్, గోపే సాయికుమార్లతో కలిసి వివిధ దొంగతనాలకు పాల్పడ్డారు. మరికొన్ని చోరీలకు నిందితులు సహా చర్లపల్లి జైలులో భువనగిరి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన నేరస్తుడు గజ్జెల శ్రీనివాస్ రెడ్డితో ప్రధాన నిందితుడికి మహా లిచ్చాలు రావుకు పరిచయం ఏర్పడింది. జైలు నుంచి తప్పించుకున్న మహా లిచ్చాలురావుకు శ్రీనివాస్ రెడ్డి 23 చోరీలు చేసేందుకు సహకరించాడు. అందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది, నల్గొండ జిల్లాలో రెండు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 దొంగతనాలు ఉన్నాయి. మహాలిచ్చాలురావు, గోపే వెంకటేష్ ఇద్దరు ఆదివారం ద్విచక్రవాహనంపైన బైపాస్ రోడ్డు నుంచి నల్గొండ పైవంతన కింద నుంచి వెళ్తుండగా భువనగిరి సీసీఎస్, పట్టణ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను విచారించగా దొంగతనాలకు పాల్పడనట్టు ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. నేరాలకు సంబంధం ఐదుగురు నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ చెప్పారు. కాగా చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టు కోవడంలో కీలక పాత్ర పోషించిన సీసీిఎస్ సీిఐ సైదయ్య , పట్టణ సిఐ సత్యనారాయణ,సీసీఎస్ ఎస్ఐ రవీందర్, హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, కానిస్టేబుల్ శ్యామ్ చందు అశోక్ లలో రాచకొండ కమిషనరేట్ సిపి మహేష్ భగవత్, డీసీపీ కే నారాయణరెడ్డి లు అభినందించారు.ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ సత్య నారాయణ, ఎస్సై వెంకటయ్య, సీసీఎస్ బందం పాల్గొన్నారు.