Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని గత 50 రోజులుగా గడుస్తున్నా వీఆర్ఏల రిలే నిరాహార దీక్షల ను చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేషం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ పేస్కేల్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ సోమవారం పోచంపల్లి తహసీల్దార్ వీర భారు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీ సాక్షిగా 2020 సంవత్సరంలో వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చి హామీని అమలు చేయకుండా తుంగలో తొక్కారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీని వీఆర్ఏలకు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మంచాల మధు, వీఆర్ఏల సంఘంమండల అధ్యక్షులు కొమ్ము ఉషయ్య, లుకజమియా, మల్లేష్, నరసింహ, యాదగిరి, భిక్షపతి తదితరులు పాల్గోన్నారు.
తుర్కపల్లి: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని తుర్కపల్లి ఉప తహసీల్దార్ సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన సమస్యలు పరిష్కారం కోరుతూ వారు చేసే సమ్మె 50 రోజులు పూర్తయిన వారి సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ తోటి వెంకటేశం ,నాయకులు గడ్డమీది నరసింహ రైతు సంఘం మండల నాయకులు కొక్కొండ లింగయ్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మెకు సోమవారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశపాక మహేష్ మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు పెంటయ్య, అనిత, రజిత, మల్లయ్య, కుమారు పాల్గొన్నారు.