Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈ నెల 14,15,16 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శివకుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 800 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దాసరి ప్రకాశ్, సాతిరి మనోజ్, మండల సహాయకార్యదర్శి తీగుళ్ల శ్రీనివాస్, శ్రావణ్, సాగర్, శివ, అజెందర్, వెంకట్, విక్రమ్ పాల్గొన్నారు.