Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పాటిల్‌హేమంత్ కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వజ్రోత్సవ ఏర్పాట్లపై నిర్వహించిన ప్రత్యేకసమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి అదనపుకలెక్టర్ ఎస్.మోహన్‌రావు, సూర్యాపేట నియోజకవర్గానికి ఆర్డీఓ రాజేంద్రకుమార్, కోదాడ నియోజకవర్గానికి ఆర్డీవో కిషోర్‌కుమార్,హుజూర్నగర్ నియోజకవర్గానికి ఆర్డీఓ వెంకరెడ్డిని నియమించామన్నారు.ఈనెల 16న జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో 15,000 మందితో భారీర్యాలీలు నిర్వహించాలన్నారు.ఇందులో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, 8వ తరగతి, ఆపై చదువుకున్న విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలన్నారు.ర్యాలీల నిర్వహణకు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమ న్వయంతో అధికారులు ఏర్పాట్లు చేసుకోవాల న్నారు.ఈ నెల 17న మంత్రి జగదీశ్‌రెడ్డి పరేడ్ గ్రౌండ్లో జాతీయజెండా ఆవిష్కరణతో పాటు, హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలుకు ఎస్టీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలలోని ఎస్టీ సిబ్బంది, అధికారులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు.వీరిని ప్రత్యేకబస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని జెడ్పీ సీఈఓ సురేష్‌ను ఆదేశించారు.18న జిల్లాకేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు, సద్దల చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.మూడు రోజుల పాటు అన్ని కార్యాలయాలను ,వ్యాపార సము దాయాలను విద్యుత్ దీపాలలతో అలంకరించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ సురేష్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, కిశోర్‌కుమార్, డీఎస్పీ నాగభూషణం, అడిషనల్ పీఆర్ఓ రమేశ్ కుమార్, రవాణాశాఖ అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీదేవి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.