Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
నడిగూడెం మండలపరిధిలోని తెల్లబెల్లి, అనంతగిరి మండలం వాయిలసింగారం పరిధిలోని సొసైటీ పరిధిలో కొన్ని నెలలుగా కోరంలేకుండానే సమావేశాలు నిర్వహించారని సొసైటీ డైరెక్టర్లు ఆరోపించారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడారు. మూడునెలలుగా తమకు సమాచారమివ్వకుండా రిజిస్టర్ పుస్తకంలో సంతకాలు సష్టించి సమావేశం జరిగినట్లుగా రికార్డులు సష్టించారని ఆరోపించారు. ప్యాక్స్ నిబంధనల ప్రకారం పాలకవర్గంతో నిర్వహించాల్సిన సమావేశాలు మూడుసార్లు పైగా నిర్వహించకపోతే పాలకవర్గాన్ని రద్దు చేయొ చ్చన్నారు.ఈ నిబంధనలను సంబంధిత అధికారులు పట్టించుకోకుండా అవినీతికి పాల్పడు తున్నారన్నారు. ఈవిషయంపై పలుమార్లు జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. సొసైటీ సంఘం పరిధిలో తెల్లబల్లి,వాయిలసింగారం గ్రామాల్లో పంటలకంటే రెట్టింపు స్థాయిలో ధానాన్ని అక్రమంగా కొనుగోలు చేసి, రవాణాచార్జీలను ప్రభుత్వం నుండి పొందే క్రమంలో చైర్మెన్, సీఈఓ, సంఘం ఖాతాలో కాకుండా ఇతర వ్యక్తుల ఖాతాలో నగదు జమ చేయించారన్నారు.కొంత నగదురూపంలో తీసుకున్నా రన్నారు.మొత్తంనగదును పూర్తిస్థాయిలో రైతులకు పంచకుండా అక్రమంగా కొంతనగదును సొంతాలకు వాడుకున్నారని జిల్లా అధికారికి గత ఏప్రిల్ 4న వినతిపత్రం అందజేశామన్నారు.కోరం లేకుండా సమావేశాలు నిర్వహించడంపై విచారణ చేయించాలని గత ఆగస్టు నెలలో జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేశామన్నారు.వీటిన్నంటిపైనా విచారణ జరిపించి తుదినివేదికను తమకు అందజేయాలని కోరారు.
ఆరోపణలు అవాస్తవం
తెల్లబెల్లి పీఏసీఎస్ చైర్మెన్-బుర్ర వెంకటేశ్వర్లు
రైతుల సమన్వయంతో సొసైటీ అభివద్ధి పథంలో నడుస్తుంది.కావాలని కొంతమంది డైరెక్టర్లు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు.సొసైటీలో నా కుమారుడు జోక్యం కలగజేసుకోవడం లేదు.
పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం
డీసీఓ-శ్రీధర్
తెల్లబల్లి సొసైటీ పరిధిలో వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం.గతంలో డైరెక్టర్లు కొన్ని సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.వాటిపై విచారణ కొనసాగిస్తాం.విచారణలో అవినీతికి పాల్పడినట్టు తేలితే కఠినచర్యలు తీసుకుంటాం.