Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ ఉద్యమాల చరిత్రను భావితరాలకు తెలియజేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యం, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ జాతి సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 16వ తేదీన జిల్లాకేంద్రంలో 15 వేలమందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈనెల 17న ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నదన్నారు.రూట్‌మ్యాప్ గురించి వివరించారు.16న శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ర్యాలీ ప్రారంభమై పీఎస్ఆర్ సెంటర్ వరకు సాగుతుందన్నారు.తాళ్లగడ్డ, కల్నల్సంతోష్ బాబు చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం, శంకర్ విలాస్సెంటర్, వాణిజ్యభవన్, రాఘవప్లాజా,పీఎస్ఆర్ సెంటర్ వరకు సాగుతుందన్నారు.మార్గమధ్యలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తామన్నారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తెలంగాణ జాతి సమైక్యత, సెప్టెంబర్ 17 గురించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.ర్యాలీ అనంతరం జమ్మిగడ్డలో గల సుమంగళి ఫంక్షన్‌హాల్, ఎంపీడీఓ కార్యాలయం, రైస్ మిల్లర్లఅసోసియేషన్ గ్రౌండ్ వద్ద సహాపంక్తి బోజానాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఆర్డీఓ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.17వ తేదీన పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జెండా ఎగురవేస్తామన్నారు.18న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.ఈ సమావేశంలో డీఎస్పీ నాగభూషణం, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రవి, విద్యాసంస్థల ప్రినిపాల్స్ పాల్గొన్నారు.