Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి పాండు
నవతెలంగాణ-మోత్కూర్
తోపుడుబండ్ల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు డిమాండ్ చేశారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో మంగళవారం తోపుడుబండ్ల కార్మికుల సమావేశం నర్సింహా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి లేక తోపుడుబండ్ల పెట్టుకొని జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, రిటైల్ వ్యాపారస్తులకు అండగా ఉంటూ వారి పొట్ట కొడున్నారని విమర్శించారు. ఉపాధి కోసం అప్పులు చేసి తోపుడు బండ్లు పెట్టుకున్న కార్మికులకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంకు రుణాలు ఇవ్వాలని, అధికారుల వేధింపులు ఆపాలని, మున్సిపాలిటీ లో పన్నులు వేయవద్దని, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కూరెళ్ల రాములు, నాయకులు శ్రీను, యాదయ్య, సోమయ్య, ఆదిలక్ష్మి, భారతమ్మ, శోభ తదితరులు పాల్గొన్నారు.