Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీ ఎంప్లాయిస్ అండ్ వర్క ర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గణపతి రెడ్డి
నవతెలంగాణ- భువనగిరి రూరల్
గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించి 11వ పీఆర్సీ ఆమలు చేసి కెటాగిరి వారీగా వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గణపతి రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల లొ సంస్థల్లో కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంటు ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ క్యాజువల్ డైలీ వేజ్ ఫుల్ టైం, పార్ట్ టైం వర్కర్స్‌తో పాటు స్కీం వర్కర్లకు స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచుతూ పీఆర్సీ అమలు చేసి 30 శాతం వేతనాలు పెంచిందని, గ్రామపంచాయతీ కార్మికులకు పెంచలేదని అన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి దాసరి పాండు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా గ్రామ పంచాయతీలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూపనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఎంపీడీవో, ఈవోపీఆర్డీ గ్రామ కార్యదర్శిల ప్రజా ప్రతినిధుల వేధింపులు అపాలని మల్టీ పర్పస్ విధానం తీసుకొచ్చి కార్మికులకు షాట లో థవుడు పోసి కుక్కలా కొట్లాట పేట్టి వచ్చినట్టుగా చేసిందని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పొట్ట యాదమ్మ. నాయకులు సిద్దెంకి యాదగిరి, ఎల్లయ్య, రాము, బిక్షం, సలీం, బాబు, శంకర్, ఎల్లేష్, స్వామి, మల్లేశం,కష్ణ పాల్గొన్నారు.