Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ధరలకనుగుణంగా కూలి రేట్టు పెంచాలి
- వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ - భువనగిరి
దేశవ్యాప్తంగా భూమి లేని పేదలందరికీ ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని, పెరుగుతున్న ధరలకనుగుణంగా కూలి రేట్లు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చట్టం ప్రకారం వేతనాలను పెంచి ప్రచారం నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య భవన్, భువనగిరిలో ఆ సంఘం జిల్లా వర్క్ షాపు రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో వేలాది ఎకరాల ప్రభుత్వ , మిగులు , ఫారెస్ట్ భూములు, వివిధ రకాల భూములు ఉన్నాయన్నారు. వాటిని భూమిలేని పేదలకు పంపిణీ చేయాల్సిన పాలకులు వాటిన కార్పొరేట్ శక్తులకు కారు చౌకగాు అమ్మి ప్రభుత్వాలు నడుపుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పేదలందరూ ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి ఆక్రమించుకొని సాగు చేసుకోవాలని పిలుపునిచ్చినారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో వ్యవసాయ కార్మికులు, పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వాలు కనీస వేతనాలు చట్టము అమలు చేసి కూలి రేట్లు పెెంచాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. రోజు కూలి రూ. 600 రూపాయలు నిర్ణయించి ఇవ్వాలన్నారు. విద్య, వైద్యంఉపాధిపరంగా 75 ఏండ్ల స్వాతంత్ర ్య భారత అవనిలో అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉన్నదన్నారు. నేటికీ వైద్యం ప్రభుత్వ రంగంలో సరిగా అందక ప్రయివేటులో డబ్బులు పెట్టి వైద్యం పొందలేక పేదలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి ,అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో భూమి, కూలి, ఉపాధి, విద్యా, వైద్యం, సంక్షేమం కోసం వ్యవసాయ కూలీలను రాష్ట్రవ్యాప్తంగా సమీకరించి పోరాటాలను ఉధతం చేస్తామన్నారు.. ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి. జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో ఆరు,ఏడు మండలాల్లో భూ పంపిణీ నిషేధం కొనసాగుతున్నదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసి ప్రభుత్వ భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలన్నారు. ఇంటి స్థలాలు, ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టము పేదలకు కాస్త కూస్తో తిండి పెడుతుందని కానీ కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందని దీనిని వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.తెలంగాణ వ్యవసాయకరం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ రెండు నెలల పాటు గ్రామ గ్రామాన వ్యవసాయ కార్మికులు పడుతున్న సమస్యలపై అధ్యయనం చేసి గ్రామ, మండల మహాసభలు జరిపిన అనంతరం సమస్యలపై జిల్లా స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా మహాసభలు వచ్చే నెల చివరి వారంలో మోత్కూరు పట్టణంలో నిర్వహిస్తామని ఈ కార్యక్రమాలను వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చినారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ రాములమ్మ, జెల్లెల్ల పెంటయ్య, జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌల్, సల్లూరి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య,గుంటోజి శ్రీనివాస్ చారి, కెవిపిఎస్ మాజీ జిల్లా కార్యదర్శి సిర్పంగి స్వామి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ బాలయ్య, ఎర్ర ఊషయ్య, కొండాపురం యాదగిరి, బలుగూరి అంజయ్య, గడ్డం సుదర్శన్, దొడ్డి బిక్షపతి, ఆనగంటి నగేష్ , మామిడి స్వరూప, కేతావత్ లక్ష్మి, వలంబట్ల శ్రీనివాసరావు, పాల్గొన్నారు.