Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలోని సీతారామఫంక్షన్హాల్లో నేడు నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాటవారోత్సవసభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం సాయంత్రం స్థానిక ఎంవీఎన్భవన్లో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను దోపిడీ, పీడన నుండి విముక్తి చేయడం కోసం భూమి, భుక్తి కోసం జరిగిన మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తా మన్నారు.తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రబిందువు అయిన జిల్లాలో ఆనాటి పోరాటంలో పాల్గొని అమరులైన వీరులను స్మరిస్తూ గ్రామగ్రామాన వారి స్తూపాల వద్ద జోహార్లు అర్పిస్తామన్నారు.ఈనెల 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరగనున్న తెలంగాణసాయుధ రైతాంగపోరాటవారోత్సవాలను జయప్రదం చేయాలన్నారు.ఈ నేపథ్యంలో జిల్లాకేంద్రంలో జరగనున్న తెలంగాణ సాయుధపోరాటవారోత్సవసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సభకు ముఖ్యఅతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి, మల్లు లక్ష్మీ హాజరువుతున్నారని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, దండా వెంకటరెడ్డి, మేకనబోయిన సైదమ్మ, మేకనబోయినశేఖర్,జె.నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్,చిన్నపంగి నర్సయ్య, కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల:సెప్టెంబర్ 11 నుండి 17వరకు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ, మండలకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.1946నుండి 1948వరకు జరిగిన తెలంగాణా ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలోనే చెప్పుకోదగ్గ పోరాటమన్నారు. నైజాం నవాబుపాలనలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగిన పోరాటం దున్నేవాడికే భూమి నినాదంతో తెలంగాణ ప్రాంతంలో 4000 మంది వీరులు మరణించారన్నారు.పదిలక్షల ఎకరాల భూమిని పేదప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకే ఉందన్నారు. ఆనాటి పోరాటస్ఫూర్తితో వీరులను స్మరిస్తూ తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకత్వంలో ఈనెల 11నుంచి 17 వరకుతెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించపడుతున్నాయన్నారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, కొండపల్లి వరలక్ష్మీ, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి సిరికొండ శ్రీను,టౌన్ కమిటీ,మండల కమిటీ సభ్యులు కుంకు తిరుపతయ్య, కట్టమధుబాబు, మచ్చ సోమయ్య, అనగంటిమీనయ్య, చలసాని అప్పారావు, రాణెమ్మ,వెంకటేశ్వర్లు, బుడిగె ధనుంజయ, ఎడ్ల సైదులు, మడుపు దేవయ్య,దోరేపల్లి సత్యం, కృష్ణవేణి పాల్గొన్నారు.