Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని, ప్రమాదాల నివారణకోసం ముందస్తుచర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.బుధవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులకు పూర్తి భరోసా కల్పించే విధంగా ఉత్తమమైన పోలీస్ సేవలను అందించా లన్నారు.సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించి నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బందోబస్తును బాగా నిర్వహిం చారని ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా పోలీస్ సిబ్బందిని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ జాతి సమైక్యత వజ్రోత్సవాలను షెడ్యూల్ ప్రకారం వివిధ శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద మరమ్మతు చర్యలు, రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాద సంఘటనలో వేగంగా స్పందించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే విధంగా స్పందించాలని కోరారు.రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అందించడం వల్ల ప్రాణ నష్టం తగ్గుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల పై వేగంగా స్పందించడానికి హైవే పెట్రోలింగ్ సిబ్బంది కి హైదరాబాద్ నందు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.శిక్షణ నిమిత్తం ఇచ్చిన సర్టిఫికెట్స్ ను సిబ్బందికి ఎస్పీ అందించి అభినందించారు.ఈ సమావేశంలో జిల్లాలో కేసుల నమోదు కేసుల స్థితిగతులు, నేరాల నివారణ చర్యలు, నేరాల అదుపు, రోడ్డు భద్రత చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ విభాగాల నిర్వహణ మొదలగు అంశాలపై సమీక్షించారు.ఈ సమావేశంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటే శ్వర్రెడ్డి, రవి, సీఐలు శ్రీనివాస్, సోమనారాయణసింగ్, నర్సింహ, రాజేష్, నాగార్జున, రాజశేఖర్, ఆంజనే యులు, శివశంకర్, రామలింగారెడ్డి, ప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.