Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల మున్సిపాలిటీకి,పెంచికల్‌దిన్న గ్రామపంచాయతీకి లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో లయన్ రావులపల్లిప్రసాద్ దంపతులు రూ.1.50 లక్షలు వెచ్చించి అందించిన ఫ్రీజర్‌బాక్స్‌లు( శవపేటికలు)పూర్వ లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముడుంబై రామానుజాచార్యులు, మున్సిపల్ చైర్మెన్ చందమల్ల జయబాబు, కమిషనర్ వెంకటేశ్వర్లు,పెంచికల్‌దిన్న సర్పంచ్ సుంకరివాణిలకు మంగళవారం నాడు అందజేశారు.స్థానికంగా ఉండకున్నా నేరేడుచర్ల, పరిసర ప్రాంతాలతో తనకున్న అనుబంధం మేరకు రావులపల్లిప్రసాద్ పేద ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా అవసరమైన సేవలు చేస్తున్నారని కొని యాడారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎడవల్లి సత్యనారాయణరెడ్డి,రీజియన్ చైర్మెన్ మాశెట్టి శ్రీనివాస్,కార్యదర్శి చల్లా ప్రభాకర్‌రెడ్డి,కోశాధికారి జిలకర రామస్వామి, వార్డు పూర్వ రీజియన్ చైర్మెన్ సుందరి నాగయ్య, జోన్ చైర్మెన్ బట్టు మధు, పూర్వాధ్యక్షులు కొణతం సీతారాంరెడ్డి, సుంకరి క్రాంతికుమార్, కౌన్సిలర్లు కొణతంవెంకటరెడ్డి, బచ్చలకూరి ప్రకాష్, క్లబ్ ఉపాధ్యక్షుడు కర్రి సూర్యనారాణరెడ్డి, సభ్యులు మన్నెం మాల్యాద్రి, లింగబోయిన రామకష్ణ,ఉప్పల లక్ష్మారెడ్డి, ఘంట రంగారెడ్డి, మిర్యాలగూడ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అనంతరెడ్డి పాల్గొన్నారు.