Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్షలోపు పంటరుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు.మంగళవారం మండలంలోని మాధవరం గ్రామంలో రైతుసంఘం గ్రామ మహాసభ జరిగినది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన పంట రుణాల మాఫీని అమలు చేయాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు మద్దతుధర చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టా లన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నాయని విమర్శిం చారు.కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.అనంతరం నూతన గ్రామకమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్ష కార్యదర్శులుగా ఎలకజాన్రెడ్డి, ఆరె చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో 9మందిని కమిటీసభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకష్ణారెడ్డి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, బట్టునాగయ్య, రైతుసంఘం సభ్యులు ఆరెమోహన్రెడ్డి, వల్లదాసు నర్సయ్య,పెద్దసైదయ్య, దేశగాని వీరబాబు, వీరస్వామి, సుందరయ్య పాల్గొన్నారు.