Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ దిక్కులేని పార్టీ అయ్యింది
- మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే వ్యవసాయ మోటర్‌కు మీటర్ తప్పదు..
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచిన మోడీ ..
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ మునుగోడు
తెలంగాణ రాష్ట్రంలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ 6గంటలు మాత్రమే సరఫరా చేస్తూ చీకటి మయం నెలకంందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలాజీ కాటన్ మిల్ లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.విద్యుత్ సరఫరా చేసి సరిగా లేక చీకటిమయం నెలకొందని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుందని, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఆరు గంటల విద్యుత్ అందుతుందని అది కూడా డబ్బులు చెల్లిస్తేనే ఇస్తున్నారు తప్ప . డబ్బులు చెల్లించని రైతుని వెంటనే విద్యుత్ సరఫరా నిలిపి నిలిపివేస్తూ దేశాన్ని చీకటి మయంగా మారుస్తున్నారన్నారు. మోడీని గెలిపిస్తే నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మోడీ అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర 380 ఉంటే ఇప్పుడు 1150 అయ్యిందని, పెట్రోలు రెండింతలు పెరిగిందని తెలిపారు. . దేశంలో నియంత, అవినీతి పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ నుండి ప్రజలను విముక్తి చేయడం కేసీఆర్ కే సాధ్యమన్నారు. దేశ రాజకీయాల్లో కేసీిఆర్ అడుగుపెడితే అన్ని ప్రాంతాలు అభివద్ధి మయంగా మారుతాయన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో దేశంలో దిక్కులేని పార్టీగా మిగిలిందనానరు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎండ్రికిచ్చలు లాగా వ్యవహరిస్తున్నారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఈ ప్రాంతంలోని ప్రతి వ్యవసాయం మోటర్‌కు మీటర్ వస్తుందన్నారు.
రాష్ట్రంలో వద్ధులకు 2000 రూపాయల పెన్షన్ అందుతుందని, మిగతా రాష్ట్రాలలో పెన్షన్ 600లే ఆ ప్రభుత్వాలు అందిస్తున్నా యన్నారు. 60 ఏళ్ల పాలనలో రెండు లక్షల మందికి ఫ్లోరైడ్ బారిన పడ్డారని ఈసారి కూడా ఇస్తే మరో లక్ష మంది కాళ్లు, చేతులు వంకరపోయి అంగవైకల్యం పొందుతారన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, వైస్ ఎంపీపీ అనంత స్వామి గౌడ్ ,మాజీ జడ్పిటిసి జాజుల అంజయ్య గౌడ్, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి నాగరాజుగౌడ్, ఈద నిర్మల శరత్, సర్పంచ్ రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.