Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్పు చేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా రెండవ మహాసభ చర్లపల్లిలోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మికులు పోరాడి తెచ్చుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ మాట్లాడుతూ ఆధునికత తర్వాత చేనేత క్రమంగా పవర్లూమ్ రంగం పెరుగుతుందని చేనేతకు వర్తించే పథకాలన్నీ పవర్లూమ్ కార్మికులకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వస్త్రాలపై జిఎస్టి విధించడం దుర్మార్గమైన చర్య అని వెంటనే జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీవనోపాధి కోసం నలగొండ పట్టణానికి వలస వచ్చి అద్దె ఇండ్లలో నివసిస్తున్న పవర్లూమ్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని, స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లా మహాసభలకు ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశమ్, రైతు సంఘం జిల్లా నాయకులు ఉట్కూరు నారాయణరెడ్డి ,చర్లపల్లి మాజీ సర్పంచ్ వంగర సత్తయ్య హాజరై సహర్ద సందేశాలు ఇచ్చారు. అనంతరం తెలంగాణ పవర్‌ను వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభల ప్రారంభానికి ముందు సీఐటీయూ జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఆవిష్కరించారు.
నూతన కమిటీ
గౌరవాధ్యక్షులుగా తుమ్మల వీరారెడ్డి , అధ్యక్షులుగా పెండెం రాములు, ఉపాధ్యక్షులు గా కర్నాటి శ్రీరంగం, చిట్టిపోలు వెంకటేశం, పెండెం బుచ్చి రాములు, మూడ చంద్రకళ ప్రధాన కార్యదర్శిగా దండెంపల్లి సత్తయ్య ,సహాయ కార్యదర్శులు గా కటకం రమేష్, కోనేటి అంజయ్య, సూరపల్లి భద్రయ్య ,కోశాధికారిగా గంజి నాగరాజు,ప్రచార కార్యదర్శిగా పసునూరి యోగానందం,
కమిటీ సభ్యులుగా యాలగం ఆంజనేయులు ,దేవులపల్లి గిరిబాబు, నిమ్మనగోటి సైదులు,రవ్వ రామకోటి, మందుల శంకర్, యస్ కె జానీ,మారో నలుగురు ఆప్షన్ మొత్తం 23 మందితో నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలోలో జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, అద్దంకి నరసింహ, పెండెం రాములు ,కర్నాటి శ్రీరంగం పెండెం బుచ్చి రాములు, చిట్టిపోలు వెంకటేశం, కటకం రమేష్, దామోదర్, దేవులపల్లి గిరిబాబు, సూరపల్లి భద్రయ్య, యోగానందం, ఎస్కే.జానీ తదితరులు పాల్గొన్నారు.