Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ- నల్లగొండ
నాడు నైజాం సర్కార్కు వ్యతిరేకంగా జమీందారుల జాగీర్దారుల ఆగడాలను ఆటకట్టించి 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తోనే సాధ్యం అయ్యిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కనగల్ మండలం బుడమర్లపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోయ అనంతరం రెడ్డి స్తూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ కోయ అనంతరెడ్డి నాయకత్వాన నల్లగొండ ఆ ప్రాంతంలో దున్నేవాడికే భూమి కావాలని వెట్టిచాకిరీ నుంచి ప్రజలను విముక్తి కలిగించాలని అనేక ఉద్యమాలు పోరాటాలు ఉధృతంగా జరిగాయన్నారు. రజాకార్లను అడ్డం పెట్టుకొని భూస్వాములు పటేల్ పట్వారీల అరాచకాలు మితిమీరిపోయాయని వాటికి ఎదురొడ్డి పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు లేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలను వెట్టిచాకిరి చేయిస్తూనే అనేక అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో జరిగాయని వాటిని ఎదిరించి మహిళలకు రక్షణ కల్పించిన ఘనత కమ్యూనిస్టుల దేనని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేని పార్టీలు వ్యక్తులు సంస్థలు కూడా తామే నిజమైన వారసులం అని చెప్పుకోవడం స్సిగ్గుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి కందుల సైదులు, మండల కమిటీ సభ్యులు ఎండి. అక్రమ్, ,సుల్తానా , కారింగు పెద వెంకులు , రామచంద్రు , పగిది సైదులు , పంతంగి మల్లయ్య , అనుముల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.