Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా గాయకుడు గద్దర్
నవతెలంగాణ-చౌటుప్పల్
ఉచిత విద్య, వైద్యం నిరుపేదలకు అందించడమే డాక్టర్ కేఏ.పాల్ సంకల్పమని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఎన్హెచ్ 9 హౌటల్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గ్లోబల్ పీస్ అండ్రిచ్ మిలియమ్స్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ.పాల్ జన్మదినం ఈ నెల 25న పురస్కరించుకొని మునుగోడు మండలకేంద్రంలోని శ్రీరామ్ హౌమ్స్ లో డాక్టర్ కేఏ.పాల్ 59వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 25లోపు మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే దక్పథంతో వైద్యశాల నిర్మించడానికి కావాల్సిన భూమిని కొనుగోలు చేసి భూమి పూజ నిర్వహిస్తామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ వైద్యశాలను, పేద విద్యార్థుల కోసం ఎల్కేజీ నుండి పీజీ వరకు చదివే కళాశాలను నిర్మిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జ్యోతి, నరేందర్ పాల్గొన్నారు.