Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సోములు
నవతెలంగాణ-మోత్కూర్
ప్రమాదంలో మృతి చెందిన భావన నిర్మాణ కార్మిక కుటుంబాలకు 10 లక్షలు, సాధారణ మృతికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు గొరిగి సోములు డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం మోత్కూర్ మండల మహాసభ గురువారం స్థానిక మార్కెట్ యార్డులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులను ఆదుకోవాలన్నారు. నిరుపేద కార్మికులే ఎక్కువగా భవన నిర్మాణం రంగంలో పనిచేస్తున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉందని, కార్మికుల పిల్లల వివాహానికి, ప్రసూతికి రూ. లక్ష రూపాయల సాయం అందించాలని, కనీస పెన్షన్ నెలకు రూ. 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు బీఓసీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నూతన కమిటీ గౌరవ అధ్యక్షునిగా రాంపాక పాపయ్య, అధ్యక్షునిగా చింత చంద్రయ్య, ఉపాధ్యక్షులుగా కురుమేటి సైదులు, బుగ్గ రాములు, సారగండ్ల రాములు, ప్రధాన కార్యదర్శిగా కూరెళ్ళ నర్సింహ, సహాయ కార్యదర్శులుగా ఉప్పల రవి, దయ్యాల బీరయ్య, అంకర్ల రమేష్, కోశాధికారిగా ఎస్కే. శ్రీనులను ఎన్నుకున్నారు.