Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపింది కమ్యూనిస్టులేనని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల భాగంగా మండలంలోని గూడూరు గ్రామంలో పెద్దారపు లచ్చయ్య,బొగ్గారపు కనకమ్మ, మూగల వెంకన్నలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేల రాజకీయ చైతన్యానికి పెట్టిందిపేరన్నారు.అందుకు నైజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం ప్రధాన కారణం 'నీ బాంచన్ కాల్మొక్త' అని బతుకులు గడుపుతున్న సామాన్యులు 'నీ గోరీకడ్తం కొడుకో నైజాము సర్కరోడా' అని తిరుగుబాటు బావుటా ఎగరేసి ధిక్కార స్వరాన్ని వినిపించి, మహత్తర పోరాటం నడిపింది కమ్యూనిస్టులేనన్నారు. నిజాం నిరంకుశ పాలనలో జరిగిన హింస, హత్యాకాండ కన్నా మించిన హింస ప్రజల మీద పటేల్ సైనిక దాడి తర్వాత జరిగిందని తెలిపారు.కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో చారిత్రిక పోరాటాన్ని నిర్వహించామన్నారు.ఈ పోరాటంలో అత్యంత సామాన్యులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు సమస్త జనులు ఐకమత్యంగా పోరాటంలో పాల్గొన్నారు.కులమతాలకతీతంగా దోపిడీ,అణిచివేతలకు వ్యతిరేకంగా సమిష్టి సమరం గావించారన్నారు.అట్లాంటి పోరాటాన్ని ఇప్పుడు కొందరు విధ్వేష రాజకీయశక్తులు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.ఇది చరిత్రను పూర్తిగా వక్రీకరించడమేనని విమర్శించారు.అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం సందర్బంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపు నుండి గ్రంథాలయం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.ఈ సభకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి హాజరువుతున్నారని, సభకు పెద్దఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశం, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ మండల కార్యదర్శి రవినాయక్, జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, సీనియర్ నాయకులు నూకల జగదీష్‌చంద్ర, బొంగరాల వెంకయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పిల్లుట్ల సైదులు,కందుకూరు రమేశ్, గోవిందరెడ్డి, ఉమ్మడి గ్రామపంచాయతీ సమన్వయ కార్యదర్శి బొగ్గారపుకృష్ణ, ఉపసర్పంచ్ చంటి, శాఖ కార్యదర్శులు గజ్జి గోపి, పెద్దారపు లింగయ్య, నాయకులు గాదెపద్మమ్మ, పాపానాయక్, మల్లయ్య పాల్గొన్నారు.