Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ -వలిగొండ
అక్టోబర్ 19,20 తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జరుగుతున్నాయని , మహాసభల ప్రారంభం రోజు అక్టోబర్ 19న వేలాది మందితో గీతన్నల గర్జన సభ నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్ తెలిపారు. గురువారం పట్టణంలోని మార్కెట్ యార్డులో కల్లు గీత కార్మిక సంఘం వలిగొండ మండల మహాసభ పబ్బతి మల్లేశం అధ్యక్షతన జరిగింది. మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలరాజు గౌడ్ మాట్లాడుతూ గత మహాసభ మూడు సంవత్సరముల నుండి ఇప్పటివరకు సంఘం చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తులో రాష్ట్రంలోనే గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు. మహాసభల నిర్వహణకు కార్మికులు సొసైటీలు తమ వంతు సహకారం అందించి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి బోలగాని జయారాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గీతకార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో విఫలమైందని విమర్శించారు. హామీల అమలు కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వలిగొండ మండల నూతన కేజీకేఎస్ మండల కమిటీ ఎన్నిక గౌరవ అధ్యక్షులుగా రేఖల లక్ష్మీ నారాయణ అధ్యక్షులుగా పబ్బతి మల్లేశం,ప్రధాన కార్యదర్శిగా గాజుల ఆంజనేయులు కోశాధికారిగా పలుసం స్వామి,ఉపాధ్యక్షులుగా మద్దెల మారయ్య,కాసుల రవీందర్, పలుసం లింగం, బంధారపు దనుంజయ్య,సహాయ కార్యదర్శిగా తొర్పునూరి శంకరయ్య, గాజుల వెంకటేశం,గోపగాని కుమార్,గందమల్ల గోపాల్,లోడే మల్లేశంతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల సొసైటీ అధ్యక్షులు మండల కార్యవర్గ సభ్యులుగా ఉంటారని తెలిపారు.