Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గుర్ని రిమాండ్‌కు తరలింపు
నవతెలంగాణ-చివ్వెంల
కల్తీ చేపల దాణా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన సంఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.డీఎస్పీ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్‌పల్లి శివారులో గల భవ్య శ్రీ ట్రేడర్స్ తవుడు మిల్లు యజమాని చేపల దాణాను కల్తీ చేసి స్వలాభం కోసం విక్రయిస్తున్నాడు.నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ విష్ణుమూర్తి తన సిబ్బందితో కలిసి భవ్యశ్రీ ట్రేడర్స్ తవుడు మిల్లుపై దాడులు నిర్వహించి సిద్ధంగా ఉన్న 459 కల్తీ దాణాను సీజ్ చేశామన్నారు.తవుడు మిల్లు యజమానితో పాటు మరో ఇద్దర్ని దురాజ్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొన్న పోలిశెట్టి రమణ, చీదేళ్ళ నాగరాజు, గంగ శ్రీనివాస్‌లను రిమాండ్ నిమిత్తం సూర్యాపేట కోర్టుకు తరలించినట్టు తెలిపారు.మత్స్యశాఖ అధికారి గుండెపురి ఉపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.కల్తీ చేపలదాణాను చాకచక్యంతో చేధించిన ఎస్ఐ విష్ణుమూర్తి తో పాటు సిబ్బందిని డీఎస్పీఅభినందించారు.