Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీపీ చింత కవితరాధారెడ్డి అన్నారు.గురువారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కారంగుల అంజన్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వడం కోసం తన వంతు కషి చేస్తానని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సొసైటీ అధ్యక్షులు అంజన్గౌడ్ హౌసింగ్ సొసైటీ గురించి విమర్శలు చేయవద్దన్నారు.పనిచేసే వారికి హౌసింగ్ సొసైటీలో స్థానం లేదని తెలిపారు.ప్రతిఒక్కరూ కలిసికట్టుగా కృషి చేస్తే జర్నలిస్టులకు ఇండ్ల కల సాధ్యమవుతుందని తెలిపారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పడిశాలరఘు, కార్యదర్శి శ్రీనివాసరావు, డైరెక్టర్లు రామకష్ణ, మల్లికార్జున్, గణేష్, రాంబాబు, పూర్ణచందర్రావు, రమేశ్, నజీర్, లక్ష్మీనారాయణ, సైదులు, శ్రీకాంత్, నాగరాజు ,సత్యరాజు, సంపత్, వెంకటరత్నం, సురేష్, సైదులు, భద్రం, దామోదర్, రాము,మురళి, మల్లయ్య, వెంకన్న, వాసు పాల్గొన్నారు.