Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జాతీయనాయకులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-పెన్పహాడ్
దేశ సంపదను సృష్టించేది వ్యవసాయ కార్మికులేనని వ్యవసాయకార్మిక సంఘం జాతీయ నాయకుడు ములకలపల్లి రాములు అన్నారు.మండలపరిధిలోని అనంతారం గ్రామంలో గురువారం ఆ సంఘం 5వ మండల మహాసభ గుంజ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందన్నారు.ఇండ్లస్థలాలు లేనివారికి స్థలాలు, ఇండ్లు లేని వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆసరా పెన్షన్లు అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేశారు.సంఘం రాష్ట్ర నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చీదేళ్ల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు వెంటనే పంచాలన్నారు.అనంతారం గ్రామంలోని ప్రభుత్వభూమిని పేదలకు పంచాలని కోరారు.లేనిపక్షంలో సంఘం తరపున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం మండల నూతనకమిటీని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా నాయకులు చినపంగి నర్సయ్య, రణపంగ కృష్ణ, గుంజ వెంకటేశ్వర్లు, వీరబోయినరవి, భూపోరాటసమితి మండల అధ్యక్షులు మామిడిఅంబేద్కర్, యాదగిరి, రాములు, అశోక్, కిరణ్, లక్ష్మమ్మ పాల్గొన్నారు.