Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రపంచంలోని వృత్తులన్నింటిలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, దేశానికి దిక్సూచి లాంటివాడు,విద్యార్థులకు మార్గదర్శకుడు ఉపాధ్యా యుడేనని ఎంఈఓ బోయిని లింగయ్య అన్నారు. గురువారం మండలకేంద్రంలోని విద్యాశాఖ కార్యాల యంలో, జిల్లా, మండల ఉత్తమ ఉపాధ్యా యులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.ఈ మేరకు సమాజంలో ఉపాధ్యాయులకు అపారమైన గౌరవం ఉందన్నారు.సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు.స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ అపర మేధావి అని, ఆయన ఉపాధ్యాయుని నుండి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారన్నారు.వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఉపాధ్యాయుని వల్లే ప్రతిమనిషి సంఘంలో ఏదో ఒక మంచి గౌరవస్థానానికి ఎదుగుతారన్నారు.ఉపాధ్యాయులు మంచిబోధన అందించి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పునాదులు వేయాలని సూచించారు.విద్యాశాఖ అభివృద్ధికి ఉపాధ్యాయుల కషి ఎంతో అవసర మన్నారు.అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పాలకుర్తి ఎల్లయ్య, ఉస్మాన్‌లను మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన ఎలిమినేటి విద్యాసాగర్,రావూరి విజయ,గోపగానిఉపేందర్, మన్నెంరామ్రెడ్డి,వంగవీటి మధుసూదన్,మంచాల రఘుకుమార్,పసునూరి సంధ్యారాణి, అనుముల శ్రీనివాస్, మేకవంశీ, పిన్నం సురేష్,అంతటి శ్రీనివాస్, మల్లెపాక అనూజలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడినల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటిసైదులు, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, టీిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్,యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెలుగురమేశ్,ప్రధానోపాధ్యాయులు కొండగడుపుల యాకయ్య, ఎం.గురువయ్య, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేశ్‌గౌడ్, ఉపాధ్యాయ బృందం భీమనపల్లి శ్రీనివాస్, గుండ్లఆంజనేయులు,హరికిషన్,గౌడిచర్ల నరేష్, రవీందర్ పాల్గొన్నారు.