Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని ప్రధాన రహదారి గుంతల మయంగా తయారయింది.పట్టణంలో ముఖ్యంగా చేపల మార్కెట్ సమీపంలో, సనా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గుంతలు భారీ ఎత్తున ఏర్పడ్డాయి.అంతేకాకుండా రహదారి మొత్తం చిన్నచిన్న గుంతలు కూడా ఉన్నాయి.దీంతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.పట్టణంలో ఈ రహదారి గుండా అనేక మంది ప్రజలు వాహనాలతో ప్రయా ణిస్తూ ఉన్నారు.గుంటలను తప్పించి వాహనాలను నడపడంతో అనేక ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి.చిన్నపిల్లలు వద్ధులు పరిస్థితి చెప్పనక్కర్లేదు.వర్షాలు పడిన రోజు ఈ గుంతలలో వాన నీరు నిలబడడంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ లేవో చూసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రయాణికులు వాహన దారులు వాపోతున్నారు.రాత్రిపూట కూడా ఈ గుంతల వలన అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు గుంతలమయంగా ఉండడంతో ఇటీవల రోడ్డు పోయడంతో కొంతమేరకు ప్రజల కు ఉపశమనం కలిగింది.65 నెంబర్ జాతీయ రహదారి కొమరబండ వద్ద నుండి దుర్గాపురం వరకు ప్రధాన రహదారి పై కూడా నూతన రోడ్డు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
రూ.4.70 కోట్లతో టెండర్ వేశాం
ఆర్అండ్బీ ఏఈ సత్యనారాయణ
రూ.4.70 కోట్లతో టెండర్ వేశాం.కానీ ఎవరూ రాలేదు.రెండునెలల్లో పనులు పూర్తిచేశాం.