Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూమిలో ప్రయివేటు వ్యక్తి ఎలా పాగా వేస్తాడు?
- పేటలో ఎంపీ ఉత్తమ్ సంచలన ఆరోపణలు
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
జిల్లాలో 2021 వానకాలం ధాన్యం కొనుగోలు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నలగొండ ఎంపీ నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యా లయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు.జిల్లాలోని నేరేడుచర్ల మండలంలో రెండుపీఏసీఎస్కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ళలో భారీ అవినీతి జరిగిందన్నారు.దాన్ని కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లు రైతుల పేర్లతో పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులు తప్పుడు పత్రాలు సష్టించి కోట్ల రూపాయలను దండుకున్నారని ఆరోపించారు.ఈ అవినీతిని వెంటనే వెలికితీయాలని పలుమార్లు కలెక్టర్,డీసీఓ, డీఎంలకు ఫిర్యాదు చేసినప్పటికీ వాస్తవాలు బయటకు రావడానికి మూడునెలల సమయం పట్టిందన్నారు.ఆ కుంభ కోణంలో అధికారుల పాత్ర ఉన్నందువల్ల కాలయాపన చేశారన్నారు.జిల్లాలోని మఠంపల్లి మండలంలో రెవెన్యూ అధికారులు సర్వేనెంబర్ 540లో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా గుర్తించామన్నారు.కాగా ఆ ప్రభుత్వభూమిని ఓ ప్రజాప్రతినిధి తన ఆధీనం తీసుకున్నాడని ఆరోపించారు.ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని స్థానిక ఆర్డిఓ దష్టికి తీసుకెళ్లినప్పటికీ తనకు పోలీసులు సహకరించడం లేదని ఆర్డీవో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరొక విషయంలో నేరేడుచర్ల మండలకేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూమిలో గతకాలంగా పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇండ్లు నిర్మించుకొని జీవన కొనసాగిస్తుండగా, ఆ ఇండ్లను ఖాళీ చేయించి అక్కడి నుంచి వారిని వెళ్లగొట్టడం బాధాకరమన్నారు.ఆ భూమిని కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు కలెక్టర్ ఎంపిక చేసినప్పటికీ ఆ ప్రభుత్వ భూమి తనదంటూ ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడం అనుమానం కలిగి స్తుందన్నారు.జిల్లాలో మూసినది పైన నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాముల ఎంపికలో కూడా కోట్ల రూపాయల అవినీతి పెద్దల చేతుల్లోకి వెళ్లిందన్నారు.చెక్‌డ్యామ్ నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై త్వరలోనే నాబార్డ్ చైర్మెన్ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు.