Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగనిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభివర్ణించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు.ఈ మేరకు ఇంతటి చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ గురువారం సాయంత్రం జిల్లాకేంద్రంలో ఖమ్మం క్రాస్‌రోడ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి ఆధ్వర్యంలో శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్,సైదిరెడ్డి, ఎంపీ బడుగులింగయ్యయాదవ్తో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్ష్షీరాభిషేకం నిర్వహించారు.అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం మంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణసచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో అభినవ అంబేద్కర్గా మారారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్మెన్ గుజ్జ దీపికా, వైస్‌చైర్మెన్ గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్లఅన్నపూర్ణ, మార్కెట్ చైర్మెన్ ఉప్పల లలితాఆనంద్, ఎంపీపీ నెమ్మాదిభిక్షం, జెడ్పీటీసీ జీడిభిక్షం, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్, రాష్ట్ర నాయకులు చినశ్రీరాములు, తళ్లమళ్ళహుస్సేన్, తప్పెట్లశ్రీరాములు,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సవరాల సత్యనారయణ, బూర బాల సైదులుగౌడ్, భరత్ మహాజన్, జ్యోతికర్నాకర్, శ్రీవిద్య, పున్న శశికాంత్, మార్కెట్ డైరెక్టర్ సైదులు, మొండికత్తి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవీ, దళితనేతలు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.