Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి
నవతెలంగాణ నల్లగొండ
వెట్టిచాకిరిని రద్దు చేయాలని దున్నేవాడికే భూమి దక్కాలని కోరుతూ రజాకారులు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.గురువారం నల్లగొండ పట్టణంలోని 16వ వార్డు బాదేగూడెంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభల సందర్భంగా పోరాట యోధురాలు కాసర్ల కమలమ్మ ని ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహౌత్తమైనా పోరాటంలో ఆయుధాన్ని ధరించి గెరిల్లా దళంలో పనిచేసిన నాయకురాలు కాసర్ల కమలమ్మ అని అన్నారు. సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని బీజేపీ నేడు అది ఒక ముస్లిం పై హిందువులు పోరాడి విమోచన కలిగించారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. భారత సైన్యాలు కమ్యూనిస్టులను ఊచకోత కోశారని రజాకారులతో చేతులు కలిపి అధికార మార్పిడి చేసుకొని రాజభరణాలు చెల్లిస్తూ గవర్నర్గా ప్రకటించుకున్నారన్నారు. ఆనాడు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తూ భారత సైన్యం దొరలకు భూస్వాములకు అండగా నిలిచిందని ఆరోపించారు. నాటి పోరాట స్ఫూర్తితో నేడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మార్పులు చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు అద్దంకి నరసింహ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సబ్యుల సయ్యద్ హాశమ్, పట్టణ కార్యదర్శి ఎండి.సలీం , జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య ,తుమ్మల పద్మ, సీనియర్ నాయకులు ఊట్కూరు నారాయణరెడ్డి వంగర సత్తయ్య పిట్టంపల్లి మాజీ సర్పంచ్ ఎన్న నర్సిరెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, దండెంపల్లి సరోజ, బూతం అరుణ, మారగోని నగేష్, గంజి నాగరాజు, రాపోలు చంద్రయ్య ,కాసర్ల గౌతంరెడ్డి, కర్నాటి శ్రీరంగం,భగత్ ,తదితరులు పాల్గొన్నారు.