Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయపాలన ఎందుకు పాటించరు..
- అధికారులు పై చైర్మన్ మండిపాటు
- హాజరు కాని అధికారుల పేర్లను కలెక్టర్ కు పంపండి
- స్థాయి సంఘాల సమావేశంలో జెడ్పీ చైర్మెన్్ బండా నరేందర్రెడ్డి
- 5 ,6 స్థాయి సంఘాల సమావేశం వాయిదా
నవతెలంగాణ- నల్లగొండ
పని లేక స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నామా అధికారులు సమయపాలన ఎందుకు పాటించరు అని జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన 1వ స్థాయీ సంఘం(ఆర్థిక) 2 వ స్థాయి (గ్రామీణ అభివృద్ధి)3వ స్థాయి (వ్యవసాయం) 4వ స్థాయి (విద్యా, వైద్య) , 7వ స్థాయీ సంఘం(పనులు) కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లు, కవ్లర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అధికారుల అసమర్థత వల్ల గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి కావడం లేదని మండిపడ్డారు. అధికారులు కాంట్రాక్టర్లకు లాభం చేస్తున్నారే తప్ప ప్రజలకు న్యాయం జరగడం లేదని అధికారులపై మండిపడ్డారు. స్థాయి సంఘాల సమావేశాలకు అధికారులు సమయపాలన పాటించడం లేదని గైర్హాజరైన అధికారుల పేర్లను కలెక్టర్ కు అందజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలనారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
5 ,6 స్థాయి సంఘాల సమావేశం వాయిదా
5 వ స్థాయీ సంఘం (మహిళా సంక్షేమం)6వ స్థాయీ సంఘం (సాంఘిక సంక్షేమం) సమావేశాలు మధ్యాహ్నం జరగాల్సి ఉండగా సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం లేక సమావేశాలను అధికారులు శుక్రవారానికి వాయిదా వేశారు.దీంతో జిల్లా అధికారులు నిరాశతో వెనుదిరిగారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మెన్ ఇరుగు పెద్దలు,సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి,డిప్యూటీ సీఈవో కాంతమ్మ,వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.