Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి
నవతెలంగాణ - మోటకొండూర్
ఎక్స్గ్రేషియా మంజూరుకు మెడికల్ బోర్డు నిబంధనలు తొలగించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లోనిఆ సంఘం మండల మహాసభ తండా పాండురంగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వత్తి చేస్తూ ప్రమాదవశాత్తు తాటి చెట్ల పై నుండి జారీ పడి గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా మంజూరు కోసం మెడికల్ బోర్డు సర్టిఫికెట్ నిబంధనలను తొలగించి, కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి భవిష్యత్తు ఉద్యమాలకు రూపకల్పన చేయడం కోసం అక్టోబర్ 19, 20 తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో సంఘం రాష్ట్ర మూడో మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసభల కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ప్రారంభం రోజు వేలాది మందితో ప్రారంభ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. సభకు గీతా కార్మికుల పెద్ద ఎత్తున కదలి రావాలని కోరారు.అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా సిగ అంజయ్య గౌడ్, అధ్యక్షులుగా బొడిగే బిక్షపతి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కోలా కష్ణా గౌడ్, కోశాధికారిగా గుండ్ల పల్లీ వెంకటేశ్వర్, ఉపాధ్యక్షులుగా కళ్లెం యాదగిరి, నమిలి స్వామి, గడ్డం అంజయ్య, సీస గోవర్ధన్, బాలగోని ముత్యాలు, జువ్వగానీ నాగమల్లయ్య, సుధాగాని రామదాసు, కార్యదర్శులుగా పంజాల మల్లేశం, తొండల ఆగయ్య, కొల బిక్షపతి, దంతురి సత్యనారాయణ, గుండ్లపల్లి పెద్ద వెంకన్న, సోషల్ మీడియా ఇన్చార్జిగా కొమ్మ గాని ప్రభాకర్ గౌరవ కార్యవర్గ సభ్యులుగా సీస మల్లేష్ లోడే యాదగిరి గాజుల బాలరాజు, వంగాల మల్లేష్ సిల్వర్ రాములు, రుద్రబోయిన శెట్టయ్య, పచ్చిమట్ల అమరేందర్, గాధగాని వెంకన్న ఎన్నుకున్నారు.