Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
- జాతీయ సమైక్యతా దినోత్సవ వజ్రోత్సవాల ర్యాలీ
నవతెలంగాణ - ఆలేరుటౌన్
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు పోరాడి తెలంగాణ ప్రాంతానికి విముక్తి చేకూర్చారని రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు .నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి జెడ్పిహేచ్ఎస్ స్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు .అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివద్ది పథంలో నడిపిస్తున్నారన్నారు. జవహర్లాల్ నెహ్రూ ,సర్దార్ వల్లభారు పటేల్, గాంధీ , ఇతర ముఖ్యనేతలు భారతదేశ స్వాతంత్య్రం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారన్నారు .ఆరుట్ల కమలాదేవి , ఆరుట్ల రాంచంద్రారెడ్డి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కొమురం భీమ్ ,సర్దార్ సర్వాయి పాపన్న ఉద్యమస్ఫూర్తితో నైజాం రజాకార్లపై పోరాటం చేశారని గుర్తుచేశారు .1956 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణాతో కలిపి ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రాపాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాలలో తీవ్రంగా అన్యాయం జరిగిందన్నారు. కెేసీఆర్ నేతత్వంలో ఉద్యమపార్టీ టీఆర్ఎస్ నిస్థాపించి 15 ఏండ్లపాటు పోరాడి ,తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం వేశారని గుర్తుచేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివద్ధి సంక్షేమ పథకాలు అమలై భారత దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డీవో సూరజ్ కుమార్,తహసీల్దార్ రామకష్ణ ,డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ ఇద్రీస్ ,వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ,టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు .
మంజూరైన పనులపై ప్రభుత్వ విప్ సునీత సమీక్షా సమావేశం
ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నియోజకవర్గ పంచాయతీరాజ్ పరిధిలో మంజూరైన వివిధ రకాల పనుల గురించి , రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత రెడ్డి అధికారులతో కలిసి సమీక్షించారు . పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రకాష్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు , ఆలేరు డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ హేమంత్ కుమార్ తో మంజూరైన వివిధ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎంజీఎస్వైౖ కింద మంజూరైన బ్రిడ్జిలను బొమ్మలరామారం మండలంలోని మాచన్‌పల్లి నుండి హాజీపురం వెళ్లే దారిలో , పెద్ద కందుకూరులో బ్రిడ్జి పనులను వెంటనే , కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించేటట్లుగా ఆదేశించారు.సి ఆర్ ఆర్,ఎం ఆర్ ఆర్ కింద మంజూరు అయిన బీటీ రోడ్లను వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాజపేట మండలంలోని కుర్రారం గ్రామంలో రోడ్డు పూర్తిగా పాడైనందున తెగిపోయినందున బ్రిడ్జి నిర్మాణం కోసం పంపించిన ప్రతిపాదనలు వాటి యొక్క పురోగతి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.