Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజమైన వారసులు కమ్యూనిస్టులే
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు .వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పట్టణ కేంద్రంలో పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా బయల్దేేరి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోనగిరి చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభ పార్టీ మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నిజం జాగీదారి భూస్వాముల పేర్ల మీదనే భూములు ఉండేవన్నారు. వారికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం మొదలుపెట్టారన్నారు. నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న ఐలమ్మను చూసి ఓర్వలేక విసునూరు రామచంద్రారెడ్డి దేశముఖ్ ఆమెను అనేక ఇబ్బందులు పెట్టినా భయపడకపోవడంతో కోర్టులో కేసులు వేసి ఇబ్బంది పెట్టారన్నారు. ఐలమ్మ పండించిన పంటను దోచుకెళ్లేందుకు రామచంద్రారెడ్డి ప్రయత్నం చేస్తే ఆమెకు అండగా ఎర్రజెండా పార్టీ నిలబడి పోరాటం చేసిందన్నారు. అలా నిజాం రజాకారులను భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజలకు అండగా నిలిచి పెత్తందారుల 10 లక్షల ఎకరాల భూములను ఎర్రజెండా పార్టీ పేదలకు పంచిపెట్టిందన్నారు. ఎర్ర జెండా పట్టుకొని కడవెండిలో ఉద్యమాలు చేస్తున్న దొడ్డి కొమరయ్యను నిజం రజాకారులు కాల్చి చంపారని తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి సంబంధం లేని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తుందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ తెలంగాణలో దున్నుకునే వారికి భూమి పంచాలని, వెట్ట్టి చాకిరి నుంచి విముక్తి కావాలని నిజం రాచరిక వ్యవస్థను కూల్చేందుకు రైతంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు నాయకత్వంలో జరిగిందన్నారు. మూడువేల గ్రామాల భూస్వాముల నిరంకుశల పాలన నుంచి విముక్తి చేసి లక్షల ఎకరాలు పంచింది కమ్యూనిస్టులేనని తెలిపారు. 4000 మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగం చేసి తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన సమర గీతం పాడాలని ఇంతటి మహత్తర పోరాటానికి బీజేపీ మతం మకిలి అనిపించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. సాయుధ పోరాటం మతాల మధ్య జరిగిన ఘర్షణ కాదని దోపిడీదారులైన భూస్వాములు అరాచకాలకు వారికి అండగాలినిచ్చిన నిజాం నవాబుకు వ్యతిరేకంగా దోపిడీకి అణిచివేతకు గురవుతున్న హిందూ ముస్లింలు ఐక్యంగా సాగించిన పోరాటమని తెలిపారు. అని విసునూరు దేశ్ముఖ రామచంద్రారెడ్డి జన్నారం ప్రతాపరెడ్డి తదితరుల జమిందార్ల దౌర్జన్యాలను ఎదిరించి భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ,దొడ్డి కొమురయ్య ,ఐలమ్మ లాంటి ఎందరో మహనీయులు అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశు బండారు నరసింహ, ఆ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ అందేలా జ్యోతి,పట్టణ కార్యదర్శి కోడె బాల నరసింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోట రామచంద్రారెడ్డి, ప్రసాదం విష్ణు ,మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి ,మండల కమిటీ సభ్యులు, బిక్షపతి ,కష్ణారెడ్డి లాలయ్య, జంగయ్య, పట్టణ కమిటీ సభ్యులు రామ్ సాని అనిల్ రెడ్డి, జగన్ మరియు ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు సిద్ధగోని పరమేశు ,శాఖ కార్యదర్శిలు రాజు, మల్లారెడ్డి, నాయకులు పురుషోత్తం రెడ్డి ,అంజి నేలు, అందెల అశోకు, సామజంగారెడ్డి ,వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు ,కొమ్ము ఊశయ్య మరియు ,వీఆర్ఏలు ,శ్రీ సాయి మెటల్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, సూపర్ ఫైన్ లిమిటెడ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటమే వీర తెలంగాణ సాయుధ పోరాటం
వలిగొండ : వీర తెలంగాణ సాయుధ పోరాటం దోపడీి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తప్ప హిందూ ముస్లింలకు మధ్య జరిగినది కాదని బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు శుక్రవారం మండల పరిధిలోని పైలువాన్ పురం గ్రామంలో సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సాయుధ పోరాట యోధుడు పాల్వంచ రాములు నారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం ప్రతి చాకిరి నిర్మూలనకు కోసం దొరల జాగీరు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పటేల్ పట్వారీ ల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో జరిగిన పోరాటం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ శాఖ కార్యదర్శి బొడ్డుపల్లి భిక్షపతి మండల కార్యదర్శి సిరి పని స్వావి,ు జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం, పి ఎన్ఎం జిల్లా కార్యదర్శి వీర్నపల్లి ముత్యాలు, నాయకులు శ్రీశైలం రెడ్డి, రేపాక ముత్యాలు, బంధాలకు ధనంజయ ,నరసింహ, కొమ్ము స్వామి ,పాల్వంచ శంకర్ జగ్గయ్య ,తదితరులు పాల్గొన్నారు.
భూమి , భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడింది కమ్యూనిస్టులే
సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరు బాలరాజు
ఆలేరురూరల్ : భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడింది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజుగౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పటేల్ గూడెం, గుండ్లగూడెం ,శ్రీనివాస్ పురం గ్రామాల్లో సాయుధపోరాట అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో ఆలేరు ప్రాంతం కీలక భూమిక పోషించిందని, ఆలేరు ప్రాంతంలోని పటేల్ గూడెం, కొలనుపాక, గుండ్లగూడెం, శ్రీనివాసపురం గ్రామాలకు చెందినటువంటి పోరాట యోధులు సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. వారి పోరాట స్ఫూర్తిని యువత పునికి పుచ్చుకొని రూపాంతరం చెందిన దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళన, పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పటేల్ గూడెం ,శ్రీనివాసపురం గుండ్లగూడెం గ్రామాలకు చెందిన వీర తెలంగాణ సాయుధ పోరాట వీరు లైన ఎసి రెడ్డి నరసింహారెడ్డి, బొమ్మ కంటి లక్ష్మీ నరసయ్య, గ్యార బాలయ్య,ఎంటికా రాములు కొండం నర్సిరెడ్డి, ఎసి రెడ్డి భద్రారెడ్డి, గ్యార సిద్దయ్య,బోప్పిడి శివారెడ్డి, రొండ్ల పుల్లయ్య, పుసలోజు వీరయ్య, చిన్నం సాయిలు, ఎలగందుల లక్ష్మీ నరసయ్య, ఎంటిక అబ్బయ్య దూసరి సత్తయ్యల స్థూపాలకు పూల మాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎగ్భాల్, మండల కార్యదర్శి దూ పటి వెంకటేష్ , మండల సీఐటీయూ కన్వీనర్ మొరి గాడి రమేశ్, మండల కమిటీ సభ్యులు నల్ల మాస తుల సయ్యా, బుగ్గ నవీన్, బొమ్మ కంటి బాలరాజు, లక్ష్మీనారాయణ, పటేల్ గూడెం శాఖా కార్యదర్శి నిడిగొండ వాలి, శ్రీనివాసపురం శాఖ కార్యదర్శి చౌడబోయిన యాదగిరి, గుండ్లగూడెం శాఖ కార్యదర్శి కేతవత్ రాములు నాయక్, బొమ్మ కంటి బిక్షపతి,సిద్ధులు, పారుపల్లి సత్తయ్య, చౌడబోయిన సుధాకర్ ,చౌడబోయిన మహేందర్, ఘన గాని మల్లేశం దండు ఐలయ్య, శీను, గ్యార ఎల్లయ్య, గ్యార ప్రసాద్, ఎంటీక మహేష్, ఏంటి క యాదగిరి, మామిడాల రాములు, కొల సదానందం తదితరులు పాల్గొన్నారు.