Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహితీ లోకానికి తీరని లోటు...
- ప్రముఖ కవి సాహితివేత డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య
నవతెలంగాణ- రామన్నపేట
స్వాతంత్య్ర సమరయోధుడు నానీల శిరోమణిగా ప్రసిద్ధిగాంచిన పొనుగోటి నరసింహారావు గురువారం హైదరాబాదులో మృతి చెందారు. మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన నరసింహారావు గ్రామ మొదటి సర్పంచిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి ఉన్నతమైన పదవులను నిర్వహించి వన్నె తెచ్చారు. పుట్టింది భూస్వామ్య కుటుంబంలో అయినప్పటికీ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమకారుడు. స్వాతంత్య్ర సమరయోధులుగా, కవిగా సమాజాన్ని చైతన్యపరచిన నిత్య చైతన్యశీలిగా వ్యవహరించిన నరసింహారావు మరణం సాహితీలోకానికి తీరనిలోటు అని దాశరధి పురస్కార గ్రహీత, కవి సాహితీవేత డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య అన్నారు. సంతాపాన్ని ప్రకటించిన వారిలో సాహిత్య మిత్ర మండలి అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, బాసరాజు యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, గ్రామ ఎంపీటీసీ మాడురి జ్యోతీ రామచంద్ర రావు, కవులు పెరుమాళ్ళ ఆనంద్, ఏబూషి నరసింహ, పాల్వంచ హరికిషన్, సాగర్ల సత్తయ్య, రాపోలు రాజశేఖర్, బొడ్డు వెంకటేశం, విజయ్ వెంకన్న, తదితరులు ఉన్నారు.