Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్:పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, అంగన్వాడీ, ఆశావర్కర్స్ జాతీయ జెండాలు చేతబూని జాతీయ సమైక్యత ర్యాలీని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ నుండి ప్రారంభమైన ర్యాలీ పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు అక్కడ నుండి తిరిగి మిర్యాలగూడ రోడ్డు వరకు చేరుకుంది.ముందుగా తెలంగాణ అమరవీరులకు అంబేద్కర్‌కు నివాళులర్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి దేశానికి స్వాతంత్రం రాకముందుకు భారత దేశంలో 500 ఏండ్లు ఏండవన్నారు. వారిలో హైదరాబాద్ ఒకటన్నారు. హైదరాబాద్ నిజాం నవాబు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగించడానికి ప్రయత్నం చేశాడని వివిధ పార్టీల నాయకుల పోరాటాల ఫలితం మరియు భారత ప్రభుత్వం ఒత్తిడితో హైదరాబాద్ సంస్థానాన్ని కూడా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశాడన్నారు.రాష్ట్రంతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో శరవేగంతో ముందుకు దూసుకెళుతోందన్నారు.రూ.3500 కోట్లతో నియోజకవర్గ పరిధిలో రోడ్లు,భవనాలు, కాలువలు, వంతెనలు, రహదారులు,సీసీరోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.