Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
అధికారమే పరమావధిగా కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు విమర్శించారు.శుక్రవారంగరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో తెలంగాణ పోరాట యోధుల వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. అంతకుముందు పోరాటయోధుల స్తూపాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుంది కేవలం కమ్యూనిస్టు లేనన్నారు. నైజాం నవాబు అరాచకాలకు వ్యతిరేకంగా, విస్నూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి ఆగడాలకు,దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన చిట్యాల ఐలమ్మ దొడ్డి కొమురయ్య ల స్ఫూర్తితో పోరాడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, గరిడేపల్లి మండలకార్యదర్శి షేక్యాకుబ్, నందిపాటి మల్లయ్య, స్వామి, మైబెల్లి, దోసపాటి భిక్షం, వెంకటేశ్వర్లు, బి.సుధాకర్, తెనాలి సోమయ్య,శంకువెంకటప్పయ్య, సీపీఐ జిల్లా నాయకులు సుధాకర్‌రెడ్డి, బిల్లా కనకయ్య, మండవసైదులు, రవినాయక్, కోలాపిచ్చయ్య, తిరుపతయ్య,మరపునాగయ్య, పెంటయ్య, నాగలి రాంబాబు, నంద్యాల వీరారెడ్డి, ఆంధ్ర బాలయ్య, గుడి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.