Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది ముమ్మాటికీ జాతీయ సమైక్యతా దినోత్సవమే
- జాతీయసమగ్రతకు మార్గదర్శనం సీఎం కేసీఆర్
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కులాల పేరుతో,మతాలపేరుతో విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలకు తెరలేపుతోందని,ఆ ఉచ్చులో తెలంగాణా సమాజం పడొద్దని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.సెప్టెంబర్ 17న జరుపుకునేది ముమ్మాటికీ జాతీయ సమైక్యతా దినోత్సవమేనని ఆయన స్పష్టం చేశారు.చరిత్ర తెలియని వారు వక్రీకరించి చెప్పే బాష్యాలు మనలో మనకు తగవులు పెట్టేందుకేనన్నారు.ఈ నెల 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమగ్రతా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లాకేంద్రంలో భారీఎత్తున సమగ్రతా ర్యాలీని నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీని ఆయన ప్రారంభించారు.అనంతరం పీఎస్ఆర్సెంటర్లో ర్యాలీ ముగింపు సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా ప్రతీక అని అది యావత్ భారతదేశానికి చాటి చెప్పేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్రం సిద్దించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు.హిందూ,ముస్లిం,క్రిస్టియన్లు ఇక్కడ సోదరభావంతో కలిసిపోయారని చెప్పారు.1948లోనే ఇక్కడికి వచ్చిన మహాత్మాగాంధీ ఇక్కడి సంస్కృతి గురించి వర్ణిస్తూ గంగా, జమున, తహజీబ్లకు హైదరాబాద్ రాష్ట్రం పెట్టింది పేరు అన్నారు. అంతే గాకుండా ఇప్పటికీ ఇక్కడ అది రంజాన్ అయినా క్రిస్మస్ అయినా బతుకమ్మ,దసరాలు ఆయిన కలిసి మెలసి జరుపుకునే సంస్కృతి ఫరీడవిల్లుతుందన్నారు.అదే సంస్కృతి యావత్ భారతదేశానికి ఆదర్శంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు.అందులో భాగమే వజ్రోత్సవ వేడుకలన్నారు.జాతీయ సమగ్రతకు తెలంగాణ మార్గదర్శనం కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ, జెడ్పీ వైస్‌చైర్మెన్ వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ పాటిల్‌హేమంత్ కేశవ్,ఎస్పీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.