Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
సమరయోధుల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రగతి పాలన సాగిస్తున్నారని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం జరిగినా తెలంగాణ విమోచనోద్యమానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మినీ స్టేడియంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాటపటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా మూడు రోజులపాటు ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించేలా సిఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నారు. దేశం కోసం పోరాడిన మహౌన్నత వ్యక్తులను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకున్నారని ఆయన తెలిపారు. భారతదేశ అత్యున్నత చట్టసభకు అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చారిత్రక సన్నివేశానికి శ్రీకారం చుట్టి, తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టి చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నియోజకవర్గం జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.