Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు , గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్ర రావడానికి,ఆనాడు ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేటి తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వివ్ జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివద్ధికి నాంది పలికిందనుకోవాలన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్‌లో విలీనమై 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. హైదరాబాద్ సంస్థానంలో భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను పీడించారు. మరోవైపు ప్రైవేటు సైన్యం రజాకార్లు దమనకాండ కొనసాగిందన్నారు.ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసుకొని స్వాతంత్రం కోసం పోరాడారు. సాయూధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ, మల్లుస్వరాజ్యం లాంటి వారు తుపాకి చేతబట్టి పోరాటం చేశారన్నారు. నాటి అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాలలో యాదాద్రి భువనగిరి జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుదామన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ కమిషనరేట్ భువనగిరి డిసిపి కె నారాయణ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత వేడుకల్లో భాగంగా శనివారం వడాయిగూడెం గ్రామ పంచాయతి కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీల పోశెట్డి గౌడ్, కార్యదర్శి కె. ఆమని, పాలకవర్గం సభ్యులు కళ్లెం క్రిష్ణ గౌడ్, బబ్బూరి సాగర్ గౌడ్, పబ్బాల రమేష్, కోట పోచయ్య, కోట స్వామి దాస్, చుక్కల కమలమ్మ, శెట్టి సంతోష, పబ్బాల మాధవి, కోట మాధవి, టిఆర్ఎస్ నాయకులు చుక్కల శంకర్ యాదవ్, జక్కుల చంద్రయ్య యాదవ్, గుండు రవి గౌడ్ లు పాల్గొన్నారు.ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య, కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఎం పి ఓ అనురాధ దేవి పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీక్కు నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సిహెచ్ కష్ణారెడ్డి, కాంగ్రెస్ జెడ్పి ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో...
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజామా ఆధీనంలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి తెలంగాణ సాయుధ పోరాటం చేశారని వారి సేవలను యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో తెలంగాణ అమరవీరులకు, సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అమరులయ్యారని వారి త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ కార్యదర్శి తంగేళ్లపల్లి రవికుమార్, వాకిటి అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు, గడ్డమీది వీరస్వామి గౌడ్, జంగయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి చిన్న మల్లేశం, వల్లందాసు ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
రాజపేట :మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు: మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగురవేశారు. మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, ఎంపీపీ రచ్చకల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, తహసీల్దార్ షేక్ అహ్మద్, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిలిండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, ఎస్ఐ వి.జానకిరాంరెడ్డి, ఏవో స్వప్న, అగ్నిమాపక కేంద్రం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సాయిదీపక్, వైద్యాధికారి ఆకవరం చైతన్యకుమార్, ఎక్సైజ్ ఎస్ఐ చంద్రశేఖర్, గ్రంథాలయ చైర్మన్ కోమటిమత్స్యగిరి, ట్రాన్స్ కో ఏఈ హుస్సేన్, సీడీపీవో జ్యోత్స్న, ఏపీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం కరుణాకర్, వెటర్నరీ ఏడీ మోతీలాల్, ఇన్చార్జి ఎంఈవో శ్రీధర్, హైస్కూల్ హెచ్ఎం టి.అంజయ్య జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కమిషనర్ సి.శ్రీకాంత్, ఆర్ఐ శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ టి. మేఘారెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు పొన్నెబోయినరమేష్, బొడ్డుపల్లి కల్యాణచక్రవర్తి, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, గౌరు శ్రీనివాస్, కె.నాగార్జున రెడ్డి, చొల్లేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం : మండలం లో ఫక్కిర్ గూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ పథకాన్ని సర్పంచ్ మెడబోయిన గణేష్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఉప సర్పంచ్ పైల్ల గోపాల్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ పాపయ్య ,ఎంపీటీసీ లత నరసింహ ,వార్డు సభ్యులు గంగాదేవి శ్రీశైలం , శివరాత్రి లక్ష్మి ,జోగు హరినాథ్ ,శ్రీనివాస్ ,పల్లపు దేవేందర్, తాళ్ల రమేష్ ,చాణిక్య రెడ్డి, కారోబార్ వెంకటేష్ ,ఆశ వర్కర్ లావణ్య ,సిబ్బంది గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.
భువనగిరి.: 17 సెప్టెంబర్ ను పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జడల అమరేందర్ గౌడ్ ,రైతు బంధు సమితి జిల్లా కోర్డినేటర్ కొలుపుల అమరేందర్ , మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు ,మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య , టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గోమారి సుధాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకట్ నాయక్ ,పంగరెక్కస్వామి, సీనియర్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వరరావు , శెట్టి బాలయ్య,ఇట్టబోయిన గోపాల్ పాల్గొన్నారు.
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీలో శనివారం జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం ముందు ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు జాతీయ జెండావిష్కరించారు. మార్కెట్, సింగిల్‌విండో కార్యాలయాల ముందు ఛైర్మన్లు బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డిలు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. సీపీఐ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆ పార్టీ మండలకార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు గిరికటి నిరంజన్‌గౌడ్, ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, కౌన్సిలర్లు కోరగోని లింగస్వామి, బండమీది మల్లేశం, పోలోజు శ్రీధర్‌బాబు, కొయ్యడ సైదులుగౌడ్, ఎమ్‌డి.బాబాషరీఫ్, సందగల్ల విజయ, కామిశెట్టి శైలజ, బత్తుల రాజ్యలక్ష్మీ, పోలోజు వనజ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట: జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని వంగపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారికంగా తెలంగాణ విలీన దినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు కొంతమంది మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకే విమోచన దినం అని చెబుతున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాలయ్య పాలకవర్గ సభ్యులు సీఈవో సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని పెద్ద కందుకూరులో జాతీయ సమైక్యత దిన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన జెండాను సర్పంచ్ భీమగాని రాములు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మచ్చ లక్ష్మీనారాయణ వార్డు మెంబర్లు గుర్రం కిషన్ ,సుజాత తదితరులు పాల్గొన్నారు.