Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరువుపల్లి సీతారాములు అన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా శనివారంమండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద పులమల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చెరుపల్లి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరి, దొరల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైకంగా పోరాటం జరిగిందన్నారు. ఈ పోరాటం మూలంగా వెట్టి చాకిరి నుంచి ప్రజలకు విముక్తి కలిగించిందన్నారు. ఈ పోరాటంలో వేలాదిమంది కమ్యూనిస్టు యోధులు మరణించారన్నారు.పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు పంచి పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేని బీజేపీ ఇప్పుడు ఆ పోరాటాన్ని వక్రీకరించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. వీర తెలంగాణ సాయుధ రహితంగా పోరాట చరిత్ర తెలియని మూర్ఖుడు బీజేపీ అధ్యక్షుడు నాటి కమ్యూనిస్టుల త్యాగాలను అవహేలన చేస్తూ మాట్లాడడం సబాబు కాదన్నారు. తెలంగాణ సాయుధరైతాంగ పోరాటం చరిత్రలో నిలిచిందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చే పనిలో ప్రధాని మోడీ ఉన్నాడన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు తీర్పులకు వ్యతిరేకంగా రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు .కేంద్రంలో మోడీ సర్కారు ఆతాన్ని అంబానీ వంటి కార్పోరేట్ శక్తులకు కొమ్ముగాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తుందన్నారు. పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే సంపదంత వారి వద్ద కేంద్రీకృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న బీజేపీి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు పోరాటాలు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం ఎట్టి చాకిరివిముక్తి కోసం రైతాంగ సాగిన సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల పోరాటంగా మల్చడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరిహార శక్తులు ప్రయత్నిస్తున్నాయని అలాంటి అసత్య ప్రచారాలను తెప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మండల కార్యదర్శి మార్తా సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలోరాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి , జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి పగిళ్ళ లింగారెడ్డి. సింగల్ విండో డైరక్టర్ అందేలా జ్యోతి. మండల కార్యదర్శి వర్గ సభ్యులు గూడూరు బుచ్చిరెడ్డి ,మంచాల మధు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ కు రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
భువనగిరిరూరల్ : నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్‌కు రావి నారాయణరెడ్డి పేరు పెట్టాలని, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వారి విగ్రహాన్ని ,వారి పేరు మీద ఆడిటోరియంను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట వీర యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు రావి నారాయణ రెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహా అధ్యక్షతన నిర్వహించిన సభలో మాట్లాడుతూ సాయిధ పోరాటంలో అత్యంత కీలకంగా నాయకత్వం వహించి భూమికోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ప్రజల్ని సమీకరించి పోరాడిన మహాయోధుడు రావి నారాయణరెడ్డిఅని అన్నారు. జిల్లాలోని 70 గ్రామాలలో పోరాటం చేసిన వీర యోధులు ఉన్నారని ఈ ప్రాంత చరిత్ర గొప్పదన్నారు. ఆ రక్తపు ధారులు ఆరకముందే బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందని అన్నారు. ప్రజలు దీనిని తిరస్కరించాలని కోరారు. నాటి పోరాట స్ఫూర్తితోటి ఈ ప్రాంతంలో సిపిఎం ప్రజా ఉద్యమాలు చేస్తూ అగ్ర భాగాన ఉందని అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటం ఎర్రజెండా నాయకత్వంలో దున్నే వారికి భూమి కావాలని భూస్వాములు, జాగీర్దారులు నుండి 10 లక్షల ఎకరాల భూమిని లాక్కొని పేదలకు పంచారన్నారు. ప్రజలను వెట్టిచాకిరి నుండి, సామాజిక అనచివేతనుండి విముక్తి చేసి తల ఎత్తి బతకమని, పోరాడాలని ఎర్రజెండా నాయకత్వంలో ప్రజల్ని చైతన్యవంతం చేసిందని తెలిపారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధులు కొల్లూరు పోచయ్య గారి సతీమణి కొల్లూరి చంద్రమ్మ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం మండల కార్యదర్శివర్ల సభ్యులు ఎదునూరి మల్లేశం, కొండా అశోకు, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, ఎల్లముల వెంకటేష్, కొండపురం యాదగిరి, మోటే ఎల్లయ్య, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, నాగిరెడ్డిపల్లి శాఖ కార్యదర్శి మల్లేశం, పెంచికలపాడు శాఖ కార్యదర్శి సుబ్బురు పోచయ్య, నాయకులు, ఎండి.జహంగీర్,పాక జహంగీర్, కొల్పుల వివేకు, జలంధర్, బొల్లెపల్లి కిషన్ సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, బత్తిని దానయ్య కొల్లూరి శ్రీకాంత్ లు పాల్గొన్నారు.
బీబీనగర్ : తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తి తో ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నారు, శనివారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, వెంకిర్యాల, రుద్రవెల్లి, గ్రామాల్లో తెలంగాణ రైతన్న సాయుధ పోరాట యోధుల చింతల యాదిరెడ్డి చింతల గంగమ్మ బందేలు రాములు, కొమ్మిడి కోదండరామిరెడ్డి అమరవీరుల స్థూపాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జాకీర్దారులకు రజాకార్లకు భూస్వాములకు వ్యతిరేకంగా నాడు పోరాటం నిర్వహించారని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్యమ నేతలు ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావుడు అనేక పోరాటం చేశారని వారి సేవలను గుర్తు చేశారు కానీ నేటి ప్రభుత్వాలు భూములను దేశ సంపదలను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొమిటీ రెడ్డి చంద్ర రెడ్డి, మండల కార్యదర్శి బండారు శ్రీరాములు, కమిటీ సభ్యులు చింతల సుబ్బారెడ్డి, ఎరుకలు బిక్షపతి గాడి శ్రీనివాస్ కంఠం వెంకటేష్ బాల బోయిన జంగయ్య, గడ్డం ఈశ్వర్, సయ్యద్ ఉమర్, సురేష్, చింతల కుమార్, తదితరులు పాల్గొన్నారు
విమోచన పేరుతో విద్వేషం నింపుతున్న బీజేపీ
సీపీిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్
రామన్నపేట : తెలంగాణ విమోచన దినం పేరుతో విద్వేషాన్ని నింపే బీజేపీి మతోన్మాద విధానాలను నిలువరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీి సభ్యులు భూపాల్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పోరాట యోదులకు జోహార్లు అర్పించారు. అనంతరం నాయకులు గాదె నరెందర్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ విముక్తి పోరాటంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీి ఇప్పడు విమోచన దినోత్సవంగా చిత్రీకరించి, మతం విద్వేషాలు రెచ్చగొడుతుందని వారిమర్శించారు. నియంత నైజాం సర్కారుకు వ్యతిరేకంగా లక్షలాది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సాహసోపేతమైన సాయుధ పోరు నడిపి మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించి, నాలుగు వేల గ్రామాలను విముక్తి చేసి, పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడికి వ్యతిరేకంగా నిలిచిన ఇలాంటి మహత్తర పోరాటాన్ని హిందూ -ముస్లిం మద్య పోరాటంగా చూపించి రాజకీయంగా లబ్దిపొందాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని తెలిపారు.మండలంలోని కక్కిరేణి గ్రామంలో వీర నారి చాకలి ఐలమ్మకు నాయకులు జోహార్లు అర్పించారు. శోభనాద్రిపురం, మునిపంపుల గ్రామాల్లో సాయుధ పోరాట అమరుల స్థూపాలకు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కమిటి సభ్యుల జల్లెల పెంటయ్య, సిఐటియు జిల్లా సహాయకార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు పబ్బతి లింగయ్య, బల్గూరి అంజయ్య, వేముల సైదులు, యం.డి రశీద్, గొరిగె సోములు, కన్నెబోయిన యాదయ్య, గోగు లింగస్వామి, కన్నెబోయిన కృష్ణ, ఎర్ర సాయిలు, తాడూరి కిష్టయ్య, బొడిగె వెంకన్న, భావండ్లపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు కోరారు. శనివారం భువనగిరి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్థూపంకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి భుక్తి, వెట్టి విముక్తి కోసం , వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, జాగిర్దారులకు, రజాకారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్న రావి నారాయణరెడ్డి, దుంపల మల్లారెడ్డి, కే. కష్ణమూర్తి, ఆరుట్ల రామచంద్ర రెడ్డి,, అరుట్ల కమలాదేవి మహానుభావులు అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు బందెల ఎల్లయ్య, బర్ల వెంకటేశం, వడ్డే బోయిన వెంకటేశం, కల్లూరి నాగమణి పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు కోరారు. శనివారం భువనగిరి ఎంపీడీవో కార్యాలయం ముందులో ముందుగాల అమరవీరుల స్థూపం కు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి, భుక్తి విముక్తి కోసం , వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, జాగిర్దారులకు, రజాకారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్న రావి నారాయణరెడ్డి దుంపల మల్లారెడ్డి కృష్ణమూర్తి ఆరుట్ల కమలాదేవి మహానుభావులు అనేక పోరాటాలు చేశారని వారి సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ నాయకులు బందెల ఎల్లయ్య, బర్ల వెంకటేశం, వడ్డే బోయిన వెంకటేశం, కల్లూరి నాగమణి పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని గుడిమల్కాపురం లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మన్నె బక్కారెడ్డి స్తూపం వద్ద సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి , మన్నె బక్కారెడ్డి జోహార్లు అర్పించారు. మండల కార్యదర్శి దొడ యాదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అన్నారు.భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం జరిగిన పోరాటంలో అనేకమంది ప్రాణాలర్పించారన్నారు. ఆనాడు తెలంగాణ రైతాంగ పోరాటంలో ఏ మాత్రం సంబంధం లేని కొన్ని పార్టీలు కొన్ని మత శక్తులు ఈ పోరాటాన్ని ముస్లిములు హిందువులపై జరిపిన దౌర్జన్యాలుగా మాట్లాడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, చౌటుప్పల మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు గుంటొజు శ్రీనివాస చారి, ఎండి పాషా, సీనియర్ నాయకులు దొంతగాని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి, గుజ్జ ఎంపీటీసీ దోడ వినోద్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు చింతకాయల నరసింహ, ఉప్పలపల్లి బాలక్రిష్ణ, బత్తుల దాసు, గుండు జంగయ్య, ఆదిమూలం నందీశ్వర్, బోయ యాదయ్య చికూర్ ఈదయ్య పుట్టపాక మాజీ సర్పంచ్ పిట్ట చంద్రయ్య సుర్వి కష్ణ సుర్వి కిరణ్ గుజ్జ ఉపసర్పంచ్ వెలిజాల గోపిక గుజ్జ సెంగల్విండో డైరెక్టర్ వస్తువుల పద్మ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి గుండు జంగయ్య గంగాదేవి బిక్షపతి పల్లె యాదిరెడ్డి బద్దుల వెంకటేశం కుటుంబ సభ్యులు మన్నే భూపాల్ రెడ్డి మన్నె రాజశేఖర్ రెడ్డి, ఎర్ర భూషయ్య ఆరుట్ల శంకరయ్య గుంటోజు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు..
మోత్కూర్: తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు అన్నారు. మండలంలోని పాలడుగు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో శనివారం అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, పిట్టల చంద్రయ్య, వడ్డేపల్లి లక్ష్మణ్, చింతకింది సోమరాజు, రమేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
గుండాల : వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వీర పుత్రులకు సీపీిఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.ఈసందర్భంగా మండలంలోని మరిపడిగ,పెద్ద పడిశాల గ్రామాల్లో జరిగిన సభలలో ఆ పార్టీ మండల కార్యదర్శి మద్దెపురం రాజు మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో గుండాల మండల పరిదిలోని పెద్దపడిశాల,వస్తాకొండూరు,సుద్దాల,వెల్మజాల,మరిపడిగ,గుండాల ప్రాంత నాయకులు సుద్దాల హన్మంతు,గుర్రం యాదగిరి రెడ్డి,నీర్మాల క్రిష్ణమూర్తి,తాల్లపల్లి సత్తయ్య,పాల్వాయి రామిరెడ్డి,రణమల్ల మల్లారెడ్డి,బుర్ర రోశయ్య,ఎండి అబ్బాసు,గాదె రాజు,గజ్జెల్లి మల్లయ్య,బోయిని రామచంద్రు,సింగారం రాజయ్య,పాలడుగు కొండయ్య,అనంతుల బాగయ్యతో పాటు అనేక మంది కీలక భూమిక పోషించారని అన్నారు.ఈకార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ,ఎండి ఖలీల్ ,మల్లెబోయిన బాలయ్య,శాఖపురం లింగయ్య,అనంతుల పెద్ద రామయ్య,జెటంగి కొమురయ్య,చంద్రగిరి సోమయ్య,రామచంద్రయ్య,గురుమూర్తి,కుమార్,నర్సయ్య పాల్గొన్నారు.