Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవ తెలంగాణ-హుజూర్ నగర్ టౌన్
రాష్ట్రంలో రానున్న సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని నల్గొండ పార్లమెంటు సభ్యులు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు .శనివారం హుజూర్ గర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు .టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. తెలంగాణ లో సెప్టెంబర్ 17 న జరుపుకునే తెలంగాణ విమోచన దినోత్సవం కు టిఆర్ఎస్, బిజెపి లకు ఏమి సంబంధం అని ప్రశ్నించారు.నిజాం ప్రభుత్వం నుండి తెలంగాణ కు విముక్తి కలిపించి దేశంలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు.1947 లో టిఆర్ఎస్,బిజెపి లు ఎక్కడ ఉన్నాయో ఆలోచించుకోవాలన్నారు. బిజెపి, టిఆర్ఎస్ లు మతపరమైన రంగు పూసి రాజకీయ లబ్ధి పొందేందుకు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ లో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిండని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ లాంటి వారిని తీసుకొని రావడం అందులో భాగమేనన్నారు. సమర్థులు ,నీతి నిజాయితీ పరులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా అసమర్ధులు, అవినీతి పరులకు పోస్టింగ్ లు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ లో 115 మంది ఐపీఎస్ లు ఉంటే 45 మందికి నేటికీ పోస్టింగులు ఇవ్వలే దన్నారు. హుజూర్ న గర్ ఎమ్మెల్యే శిష్యులు ,భినామి లు హుజూర్ నగర్ నడి బొడ్డులో కోట్లాది రూపాయల మున్సిపాలిటీ లే అవుట్ భూములను కబ్జా చేశా రన్నారు.జిల్లాలోఇసుక,మద్యం ,గుట్కా,మట్టి,పేకాట,రేషన్ బియ్యం దందా,అనేక అక్రమ వ్యాపారాలకు జిల్లా ఎస్పీ ఆజ్యం పోస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ ,నాయకులు సామల శివారెడ్డి, కస్తాల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.