Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.శనివారం స్థానిక యస్పీ కార్యాలయ ఆవరణలో గల పెరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ పెరేడ్ నిర్వహించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం 8ఏండ్లలో ఎనలేని పురోగతి సాధించిందని, ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రా ,దేశాల ప్రజాప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి అమలు అమలు తీరును పరిశీలిస్తున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు . చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందన్నారు. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని మంత్రి తెలిపారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఇటీవలనే భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకున్నామనీ దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.స్వాతంత్య్రం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేదన్నారు. బ్రిటీష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటీష్ ఇండియా ఒక భాగం కాగా స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగమని తెలిపారు. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనల వల్ల, దేశానికి తొలి హౌంమంత్రి అయిన సర్దార్ వల్లభ్ భారు పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు పూర్తయ్యాయని 75 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజును జాతీయ సమైక్యతా దినంగా మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నా మన్నారు. ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆదివాసీ యోధుడు కొమరం భీమ్ తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్య లతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామన్నారు. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీమూర్తులకు మంత్రి ఘనమైన నివాళులర్పిద్దా మన్నారు. అనంతరం వీరు డ్రీమ్స్ అకాడమీ సూర్యాపేట వారు ,జవహర్ బాల్ భవన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, ఎస్ ఎల్ ఎస్ స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .ఎస్ ఎల్ ఎస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన మాది తెలంగాణ జాతి అనురూపకం పలువురును ఆకట్టుకున్నది.ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్.పి చైర్ పర్సన్ గుజ్జా దీపికా యుగంధర్, జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, యస్.పి. రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ పి. అన్నపూర్ణ, జెడ్.పి. వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, కౌన్సెలర్లు, ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, పి.డి. కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య, సి.పి.ఓ. జి. వెంకటేశ్వర్లు, సంక్షేమ అధికారులు శంకర్,అనసూర్య, దయానంద రాణి, శిరీష, ఏ.ఓ శ్రీదేవి సిబ్బంది, పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అభివర్ణించారు. శనివారం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారని ప్రశంసించారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టి బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ కవిత రాధారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, కల్లూరి పద్మజ, షఫీ, మైస రమేష్, కోట మధుసూదన్, అల్వాల వెంకట్, ఒంటి పులి రమ శ్రీనివాస్, కట్టబోయిన జ్యోతి శ్రీనివాస, మామిడి రామారావు, మేధర లలిత,బెజవాడ శిరీష శ్రవణ్,కాజా,సాదిక్, డాక్టర్ బ్రహ్మం, జానకి ఏసయ్య, గ్రంధాలయ చైర్మన్ రహీం తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆద్వర్యంలో
నాటి నిజాం నవాబు పాలనను అంత మొందించడం లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు పారా సీతయ్య కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ సెంటర్లో జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీి ఉపాధ్యక్షులు పారా సీతయ్య, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, రాష్ట్ర కార్యదర్శులు చింతలపాటి శ్రీనివాసరావు, ఆవు దొడ్డ ధనమూర్తి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు గంధం యాదగిరి, కర్రి సుబ్బారావు ,షాబుద్దీన్, వరప్రసాద్ రెడ్డి, బాజన్, కాంపాటి శ్రీను, బాగ్దాద్ ఎస్ దాని రజనీకాంత్ దాదావలి సైదిబాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సమైక్యత వారోత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని గుడిబండ, గణపవరం గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ నెంబర్ ఎండి రఫీ, యరగానీ లక్ష్మయ్య, పులి రాజారావు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి రఫీ, సొసైటీ డైరెక్టర్ ఓ శ్రీనివాసరెడ్డి, కుక్కడపు సైదులు, ఎర్రవరం పి ఎస్ ఎస్ మాజీ చైర్మన్ కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పుల సాగర్ రెడ్డి, అన్నెం చిన్నవెంక రెడ్డి, పాపిరెడ్డి, గణపారం ఎంపీటీసీ సింగారెడ్డి హిమబిందువు సుమన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు జాబిశెట్టి నాగప్రసాద్, మాజీ ఎంపీటీసీ సీతారాం రెడ్డి, బండి కోటయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు.తుంగతుర్తి సబ్ జూనియర్ సివిల్ కోర్టులో ఇంచార్జ్ న్యాయమూర్తి సురేష్ కుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ డానియల్ కుమార్ ,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్, విద్యాశాఖ కార్యాలయంలో ఎం ఈ ఓ బోయిని లింగయ్య, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడిఏ జగ్గు నాయక్ ,ప్రభుత్వ వైద్యశాల యందు డాక్టర్ నాగు నాయక్, ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ బాలాజీ నాయక్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాంప్రసాద్ ,రైతు సేవ సహకార సొసైటీ కార్యాలయంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, గ్రంథాలయంలో గ్రంథాల చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, పలు కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
నేరేడుచర్ల : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్సై ఎం నవీన్ కుమార్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వాసి మల్ల సరిత, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ లకుమల్ల. జ్యోతి, మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ చందమల్ల జయ బాబు, స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ ఇంజమూరి యశోద రాములు, శాఖ గ్రంథాలయంలో చైర్మన్ గుర్రం మార్కండేయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలతారెడ్డి జెడ్పిటిసి రాపోలు నరసయ్య వైస్ ఎంపీపీ తాళ్లూరు లక్ష్మీనారాయణ స్థానిక మునిసిపల్ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు మాజీ వార్డు మెంబర్లు మండల ఎంపీటీసీలు అన్ని పార్టీల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్‌ఎస్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను శనివారం ఎగరవేశారు. మండల పరిషత్ లో ఎంపీపీ మర్ల స్వర్ణలత కార్యాలయంలో డిప్యూటీ తాహాశీల్దారు లాలునాయక్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ యాదవేందర్ రెడ్డి, పిఎసిఎస్ లో చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ కార్యాలయంలో ఏవో దివ్య, జండా ఎగరవేశారు. కార్యక్రమంలో ఆర్ ఐ లు అంజయ్య, రమేష్, వెంకటేశ్వర్లు, ఇంద్ర కుమార్, ప్రసాద్, స్వామి,నాయకులు చంద్రారెడ్డి, వెంకటరెడ్డి, మల్లారెడ్డి, బ్రహ్మం వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.ఏపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ సాన బోయిన రజిత సుధాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల ఉపసర్పంచ్ ఆవిరే పద్మ అప్పయ్య పాల్గొన్నారు.
చివ్వేంల : మండల వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్,తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ రంగారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలు కార్యక్రమాలలో ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, ఎంపీడీఓ లక్ష్మి,తహసీల్దార్ రంగారావు, డిప్యూటీ తహసీల్దార్ ఝాన్సీ,ఎంపీవో గోపి,ఏపిఓ నాగయ్య,ఆర్ ఐ వెంకట్ రెడ్డి,సర్పంచులు,ఎంపీటీసీ లు,పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట కలెక్టరేట్ : తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో జాతీయజెండా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తరువాత జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ జాతీయ జెండా ఎగురవేశారు, అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు బహుమతిగా అందజేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో ముచ్చటించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని, అలాగే రేపు సాయంత్రం సద్దలచెరువు వద్ద జరిగే సంస్కతిక కార్యక్రమాలకు అధికారులు సిబ్బంది హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనప కలెక్టర్ యస్ .మోహన్ రావు, కలెక్టరేట్ ఏవో శ్రీదేవి, సిపిఓ జి. వెంకటేశ్వర్లు డిఆర్డిఓ పిడి కిరణ్ కుమార్ సంక్షేమ అధికారులు శంకర్ ,అనసూయ, దయానందరాణి, శిరీష కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమలగిరి : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాస ప్రాంగణంలో డా.బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని తుంగతుర్తి శాసనసభ్యులుడా.గాదరి కిశోర్ కుమార్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజని రాజశేఖర్, వైస్ చైర్మన్ మండల అధ్యక్షుడు సంకెపల్లి రఘునందన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, కౌన్సిలర్లు కుదురుపాక శ్రీలత రాములు, పత్తేపురం సరిత నాగార్జున, గిలకత్తుల ప్రియలత రాము గౌడ్, సంకేపల్లి జ్యోతి నరోత్తం రెడ్డి,మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్,పట్టణ అధ్యక్షుడు తిరుమణి యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి తెడ్డు భాస్కర్, ఇమ్మడి సోమనరయ్య, కందుకూరు లక్ష్మయ్య మరియు ప్రజా ప్రతినిధులు, నాయకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్ : తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూరెడ్డీ కళావతి సంజీవరెడ్డి, తహసీిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జమీరోద్దీన్, పోలీస్ స్టేషన్ ఆవరణంలో వై. ప్రసాద్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో పిఎసిఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, విద్యాశాఖ కార్యాలయంలో ఎంఇవో రాములు నాయక్ పశు వైద్యశాలలో డాక్టర్ రవి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య, వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని వెంకేపల్లి లో నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి విగ్రహానికి ప్రజలు పూలమాలలు వేసి శనివారం ఘన నివాళులు అర్పించారు. నాటి నిజాం సర్కార్‌కు, రజాకార్లకు , దేశ ముక్కు దొరలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నాటి యువత ను చైతన్యపరచడం కోసం,,,, బండెనక బండి గట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతవు కొడుకో నైజాము సర్కరోడా,,, అనే పాట పాడుకుంటూ ప్రజలను చైతన్య పరచడం గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోనుకునూరి సైదులు. గ్రామ ప్రజలు చిరంజీవి, ప్రవీణు నరేష్ తదితరులు పాల్గొన్నారు
మద్ధిరాల : తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలలో బాగంగా మండలంలోని అన్ని ప్రభత్వ,ప్రవేట్ కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరించారు.స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై నర్సింగ్ వెంకన్న,తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్ అమీన్ సింగ్,టి ఆర్ యస్ కార్యాలయం లో మండల అధ్యక్షుడు రజాక్, వివిధ గ్రామాల్లో ఆయ సర్పంచులు పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.
హుజూర్ నగర్ : పట్టణంలో జాతీయ సమైక్యత దినోత్సవాల సందర్భంగా రెండవ రోజు శనివారం ప్రజాప్రతినిధులు అధికారులచే జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్యక్షత న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని జాతీయ ప్రధాన ఆవిష్కరించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం హైదరాబాదులో బంజారా భవన్ ప్రారంభానికి వెళుతున్న ప్రజాప్రతినిధుల ఉద్యోగుల బస్సును ఆయన ప్రారంభించారు స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ వెంక రెడ్డిజాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఎంపీడీవో శాంతకుమారి సూపరిండెంట్ నర్సిరెడ్డి చంద్రకళ ఏపీవో శైలజ తదితరులు పాల్గొన్నారు.
పెన్ పహాడ్:జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు పురస్కరించుకొని మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శేషగిరిరావు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్, వివిధ కార్యాలయాల వద్ద తదితర అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామ సర్పంచ్‌లు, జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య, ఎంపీడీవో తుంగతుర్తి వెంకటాచారి, సూపరిడెంట్ బాణాల శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ పద్మ, ఆర్ఐ స్వప్న, ఏఓ కష్ణ సందీప్, ఏపీవో రవి, కోఆప్షన్ సభ్యుడు షేక్ రఫీ, పిఏసిఎస్ చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి, రైసస జిల్లా డైరెక్టర్ తూముల ఇంద్రసేనారావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు
నాగారం: మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ హరిశ్చంద్ర ప్రసాద్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలోఎంపీపీ కూరం మని వెంకన్న ఎంపీడీఓ జి శోభారాణి ఏవో గణేష్ డిప్యూటీ తాసిల్దారు కంట్ల మయ్య సీనియర్ అసిస్టెంట్ ఉప్పలయ్య కానిస్టేబుల్ గిరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.