Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పేద ప్రజలను దోపిడీ పీడన నుండివిముక్తి చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మ బిక్షం ల విగ్రహాలకు పూలమాలవేసి జోహార్ అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులు పేద ప్రజలను దోపిడీ పీడల నుండి విముక్తి కలిగించారన్నారు. పోరాటయోధులు కల్పించిన చైతన్యం తో భూస్వామ్య పెత్తందారులు మరియు నైజాం రజాకారులకు వ్యతిరేకంగా ప్రజాక ప్రజలను పోరాటంలో పాల్గొనేలా చేశారని పేర్కొన్నారు. పోరాటంలో 4000 మంది అమరులయి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టారని తెలిపారు. భూస్వామ్య పెత్తందారి పోకడానికి వ్యతిరేకంగా నైజాం రసాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని నేటి మతోన్మాద పాలకులు హిందూ, ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. మతోన్మాద పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులు చేసిన పోరాటాన్ని గ్రామ గ్రామాన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతో ఉందన్నారు .అలాంటి పోరాట యోధుల స్ఫూర్తితో నేటి మతోన్మాదులు పాలనకు వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు ,కోట గోపి, ఎలుగూరి గోవిందు, చెరుకు ఏకలక్ష్మి, సైదమ్మ, మేకనబాయిన శేఖర్, కొప్పుల రజిత, చినపంగి నరసయ్య, జే నరసింహారావు పాల్గొన్నారు
నేరేడుచర్ల : వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటోత్సవాలను మండలంలోని పెంచికల్ దిన్నె గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సంతాప సభ మర్రి నాగేశ్వరావు అధ్యక్షతన నిర్వహించారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు పాల్గొని అమరవీరుల స్తూపాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి బుక్తి విముక్తి పోరాటాలలో పాల్గొని అసవులు బాసిన అమరులు కామ్రేడ్ దేవభక్తి వెంకటేశ్వరరావు, పెండెం రాములు, వాసిరెడ్డి నరసయ్య, నందమూరి నారాయణ, వల్లభనేని సీతారామయ్య నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల తూటాలకు బలైనారు.ఈ కార్యక్రమంలోఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొదమ గుండ్ల నగేష్, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, శాఖ కార్యదర్శి అల్వాల శ్రీధర్, మండల కమిటీ సభ్యులు మామిడి నాగ సైదులు వెంకటేశ్వర్లు చలసాని అప్పారావు బొప్పన రాణి పాలకూర రాములమ్మ నందమూరి బాబురావు కర్నాటి మురళి ప్రసాద్ రావు జీడిమెట్ల రవి కొదమగుండ్ల సైదమ్మ రేపెల్లి బిక్షం వల్లంశెట్ల నారాయణ, ఈ సందర్భంగా సాయుధ పోరాట యోధురాలు కొంజేటి సత్యవతిని ఘనంగా సన్మానించారు.
మఠంపల్లి :తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల త్యాగాలు మరువలేనివని సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు శాఘంరెడ్డి జగన్ మోహన్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు భూక్యా పాండూనాయక్,మండలకార్యదర్శి మాలోత్ బాలూనాయక్ లుఅన్నారు.శనివారం మండలంలోని చౌటపల్లిలోని ఇరిగెల లింగారెడ్డి స్మారక స్థూపనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈక్రమంలో ఎస్డీ రంమియా,పెద్ద వెంకన్న,కె వెంకటేశ్వర్లు,పొడిశెట్టి రాము శాఘంరెడ్డి సీతమ్మ,వెంకటరెడ్డి, నాగయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు ఎస్ : తెలంగాణ నివాళులార్పించిన రైతాంగ సాయుధ పోరాట యోధులకు సిపిఎంఆధ్వర్యంలో శనివారం నివాళులర్పించారు.ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో భూమి బుక్తి విముక్తి కై వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు బెల్లంకొండ సత్తయ్య గౌడ్ ఆగమ్మ గార్ల స్థూపం వద్ద శనివారం నాడు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి సిపిఎం మండల కార్యదర్శి అవిరే అప్పయ్య , వెంకటేశ్వర్లు, సాన బోయిన ఉపేందర్, ఇస్తారి మహేష్, నాగరాజు లింగయ్యా సతీష్ ఉత్తేజ్ పాల్గొన్నారు.
మునగాల తెలంగాణ సాయుధ పోరాట వారోత్స వాల సందర్భంగా మునగాల జగన్నాధ పురం విజయరాఘవాపురం నర్సింహు ల గూడెం విజయరాఘవాపురం గ్రామా ల్లో అమరవీరుల స్దూపాలకు పలువు రు నాయకులు పూలమాలలు వేసి ని వాళులర్పించారు అంతకుముందు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగా ణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడు కలు నిర్వహించి జాతీయ జండాలను ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో సిపి ఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేదర మెట్ల వెంకటేశ్వర రావు దేవరం వెంకట రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమ పంగు జానయ్య మాజీ సర్పంచ్ లు షేక్ సైదా, కొండారెడ్డి మాజీ ఎంపిటిసి విజయలక్ష్మి సుంకరి పిచ్చయ్య వీర బోయిన వెంకన్న రావులపెంట వెంకన్న బ్రహ్మం డివైఎఫ్ఐ నాయకులు గడ్డం వినోద్ నాగరాజు కార్తీక్ అధికారులు పాల్గొన్నారు.