Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి చైర్మెన్ గుత్తా
నవతెలంగాణ- ప్రాంతీయ ప్రతినిధి
నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ అసమాన త్యాగాలు చేశారని, నాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది అని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా శనివారం నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న శుభసందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులందరికీ జోహార్లు తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని, తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్‌లో విలీనమై నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలం దరికీ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిం చాలని నిర్ణయించిందని తెలిపారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రానికై పోరాడుతూనే ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్టు సంస్థానాల విషయంలో స్వతంత్రంగా ఉండటం లేదా భారత దేశంలో లేదా పాకిస్తాన్లో విలీనం కావడానికి అవకాశం ఇచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారత దేశంలో విలీనం అయ్యాయని తెలిపారు. జునాఘడ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు. హైదరాబాదు సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషా మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం రాజు నిజాం స్వతంత్రంగా ఉంటుంది అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి, ఎస్పీ రేమా రాజేశ్వరి, జెడ్పీ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందాడి సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండకలెక్టరేట్ :తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ టి వినరు కృష్ణారెడ్డి శనివారం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కరరావు, రాహుల్ శర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో..
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఉపకులపతి ఆచార్య చొల్లేటి గోపాల్ రెడ్డి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరి ంచారు. స్వాతంత్రానంతరం జరిగిన పరిణామాలను హైదరాబాద్ రాష్ట్ర అవతరణను విద్యార్థులకు వివరించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వకృత్వ వ్యాసరచన, పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య తుమ్మ కృష్ణారావు, డాక్టర్ అల్వాల రవి, డాక్టర్ మిరియాల రమేష్, డాక్టర్ కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ ఆకుల రవి, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ క్యాంపు కార్యాలయంలో..నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ క్యాంపు కార్యలయంలో జాతీయ జండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనిమద్దె సుమన్, జడ్పీటీసీ వొంగూరి లక్ష్మయ్య, నల్గొండ మండల వైస్ ఎంపీపీ ఓబీసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో..తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నల్లగొండ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి రమణ చారి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి :తెలంగాణ వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, వైద్యాశాలల్లో, గ్రామ పంచాయితీ కార్యాలయల్లో సంబందిత అధికారులు, సర్పంచులు మువ్వన్నెల జాతీయ జెండాలను అవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా శనివారం నాంపల్లి మండల వ్యాప్తంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. నాంపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కుంభం విజయ కృష్ణారెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ చిలుకూరి లాల్ బహదూర్, కస్తూరిబా గాంధీ పాఠశాలలో పాఠశాల ప్రత్యేక అధికారిని విజయ శ్రీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సంజీవరావు, మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణాధికారి నవీన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఫ్యాక్స్ చైర్మెన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ అమరవీరుల ఆశయాల సంక్షేమ సమితి అధ్యక్షుడు కోరే సాయిరాం, బీజేపీ కార్యాలయం ముందు రాందాస్ తండా సర్పంచ్ మెగావత్ నీలా రవి నాయక్ జాతీయ జెండాలను విష్కరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు, మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీల వద్ద ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నాంపల్లి టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపీటీసీ కోరే ప్రమీల మురళి, వ్యవసాయ విస్తరణ అధికారులు అనూష, కవిత, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ :నకిరేకల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, స్థానిక కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో ముందుందని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శనివారం జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యతకు చిహ్న మన్నారు. దేశ సమగ్రత, సమైక్యతకు తెలంగాణ పాటుపడుతుందన్నారు. అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఆదివాసీ గిరిజన బహిరంగ సభ కార్యక్రమానికి నకిరేకల్ నుండి వెళ్లే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాల ధనలక్ష్మి నగేష్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవ రెడ్డి, కేతేపల్లి పిఎసిఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, కేతేపల్లి బొప్పని స్వర్ణలత సురేష్, ఎంపీపీ పేరుమాళ్ళ శేఖర్, కౌన్సిలర్లు గాజుల సుకన్య, దైద స్వప్న పాల్గొన్నారు.
నల్లగొండ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ ఇరుగు పెద్దులు, సీఈఓ ప్రేమ్ కరణ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, అభిమన్యు శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, పూజిత శ్రీనివాస్, భాస్కర్, దండంపల్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇతర కార్యాలయాల్లో..జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రెమా రాజేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జూపూడి ప్రభాకర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాస్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గోపి, రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై సురేష్ కుమార్, జాతీయ జెండాలను ఎగురవేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మెన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొండలరావు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ లచ్చూనాయక్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ భవనంలో...
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్ భవన్లో నల్లగొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అమరవీరుల ఆశయ సాధనలో పునరంకితం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు యం. శ్రవణ్ కుమార్, జిల్లా కార్యదర్శి కే.కిరణ్ కుమార్, చేపూరి నరసింహ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెల్లంకి మాధవి, రాష్ట్ర కార్యదర్శి నాగిళ్ల మురళి, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ :జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను చిట్యాల తహసిల్దార్ కే శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, డిప్యూటీ తాసిల్దార్ రాగ్య నాయక్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అవిసెట్టి శంకరయ్య, జిట్టా సరోజ, తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్లో...
జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల పోలీస్ స్టేషన్ నందు స్థానిక ఎస్సై ధర్మా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ దాసరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుంకరి ధనలక్ష్మి యాదగిరి ఎంపీడీవో లాజర్ పలువురు ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
మిర్యాలగూడ :తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణం లోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జాతీయ జెండాను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎంపీపీ నూకల సరళ హనుమంతు రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, తదితరులు పాల్గొనారు.
దేవరకొండ : తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యతకు చిహ్నం అని ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరామ్, మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మెన్ సిరందాసు లక్ష్మమ్మ కష్ణయ్య, ఎంపిపి నల్లగాసు జానుయాదవ్, జడ్పిటిసి మారుపాకుల అరుణ సురేష్ గౌడ, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరిసాగర్ : మండలకేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ జండాలను ఎగుర వేశారు. తాహశీల్దార్ కార్యాలయంలో తాహశీల్దార్ పాండునాయక్ , మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ అస్గర్ అలి పోలీసు స్టేషన్ లో ఎస్ఐ బాబు ,గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ శాగం శ్రవణ్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య జాతీయ జండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి యడవెల్లి దిలీప్‌రెడ్డి, ఎంపిఓ పద్మ ఆర్ఐ నాగరాజు, వార్డు సబ్యులు ప్రమీల ,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి : రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం నేటితో 75వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు యన్ టి ఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆదివాసి గిరిజన సమ్మేళనం సభకు బస్సును ప్రారంభించి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుల్లెంల సైదులు, ఎంపీపీ గౌరవ సలహాదారు పోకల రాజు,ఎంపిడిఓ దండ జితేందర్ రెడ్డి,ఎంపీఓ రవి కుమార్ , ఏపియం నిజాముద్దీన్, ఏపీఓ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నోర్కట్పల్లి : జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం మండలంలో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయం వద్ద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి తాసిల్దార్ మురళీమోహన్, ఇందిరా కాంతి భవనంలో ఏపీఎం శ్రీనివాస్, ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీఓ యాదయ్య, స్థానిిక పోలీస్ స్టేషన్లో సీఐ శివరాంరెడ్డి, గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుండగోని యాదగిరి గౌడ్, ఎస్సై రామకృష్ణ గౌడ్, ఇంచార్జ్ ఎంపిఓ సుభాన్, ఎంపీటీసీ యాదయ్య, టిఆర్ఎస్ మండ అధ్యక్షులు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు దోసపాటి విష్ణుమూర్తి, ఆర్ ఐ మంగమ్మ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ :నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా చైర్ పర్సన్ కర్ణ అనూష రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించి, అమరవీరులను స్మరించుకుని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ, మంగతనాయక్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి,కమిస్నర్ రవీందర్ రెడ్డి, గుజ్జుల కొండలు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.