Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆఫీసు నుండి బైక్‌ర్యాలీ కోర్టు, బస్టాండు వయా రామగిరి టెంపుల్, పెద్దగడియారం, మైసయ్య విగ్రహం, ప్రకాశం బజార్, కలెక్టరేట్, పెద్దబండ, మీదుగా బస్టాండ్ సుభాష్ విగ్రహం దగ్గర ముగింపు సభ జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ..భూస్వాములు దొరలు రజాకారుల అండతో పేదలపై దాడి చేస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటున్న తరుణంలో ఎర్రజెండా నాయకత్వంలో కమ్యూనిస్టులు వెట్టి చాకిరిని రద్దు చేయాలని, దున్నేవారికి భూమి దక్కాలని సాయుధ పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అమరత్వంతో ఉద్యమం ఉవ్వెత్తున లేసి రజాకారులను తరిమికొట్టే దాకా వెళ్ళిందన్నారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తూ కేంద్ర హౌంమంత్రి సర్దార్ వల్లభారు పటేల్ నైజామును లొంగదీశారని, తెలంగాణ విముక్తి చేశారని, మతం రంగు పులుముతూ వక్రభాష్యం చెపుతుందని తెలిపారు. నైజామ్ను లొంగదీస్తే రాజభరణాలు చెల్లిస్తూ గవర్నర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. కమ్యూనిస్టులను అనుచడానికి కేంద్ర బలగాలు కుట్ర చేశాయని ఆరోపించారు. రజాకార్ల పాలన నుండి వేల గ్రామాలను గ్రామ స్వరాజ్యాలుగా ప్రకటిస్తూ పదివేల ఎకరాలకు పైగా భూ పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. పోరాటంలో గాని, ఆనాడు కనీస రాజకీయ పార్టీగా కూడా లేని బీజేపీ చరిత్రలో వక్రీకరిస్తూ తెలంగాణ పోరాటాలను కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. బైక్ ర్యాలీ అనంతరం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభ నిర్వహించారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి సలీం అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాశమ్, బండా శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, భూతం అరుణకుమారి, మధుసూదన్‌రెడ్డి, గుండాల నరేష్ మారగోని నగేష్, ఎస్కే మహబూబ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ :తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చారిత్రాత్మకమన్నారు. ఆ పోరాట వీరుల ప్రాణ త్యాగాల వల్లనే తెలంగాణ పేదలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ కూరెల్ల లింగస్వామి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవాన్ని శనివారం నకిరేకల్ పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ.. నకరేకల్ ప్రాంతంలో ముసుకు వెంకట్ రెడ్డి, పసునూరి వెంకటరెడ్డి, రాచకొండ ఎల్లా స్వామి లాంటి ఎందరో వ్యక్తులు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు బోళ్ళ నరసింహారెడ్డి, మండల కార్యదర్శి రాచకొండ వెంకటగౌడ్, పట్టణ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు యానాల కృష్ణారెడ్డి, బి ప్రకాష్‌రావు, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల :తెలంగాణ పేదలకు వెట్టిచాకిరీ విముక్తి, పది లక్షల ఎకరాల భూమి పంపిణీ కమ్యూనిస్టుల పోరాట కృషి ఫలితమే అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకొని చిట్యాల మండలం గుండ్రాంపల్లి, వెలిమినేడు, ఉరుమడ్ల, చిన్న కాపర్తి గ్రామాలలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'బాంచన్ దొర నీ కాళ్ళు మెక్కుతా...'అనే బక్క జీవుల చేత బంధూకులు పట్టించిన చరిత్ర వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వీరులు కమ్యూనిస్టులకే ఉన్నదన్నారు. గుండ్రాంపల్లి అమరవీరుల స్థూపం,వెలిమినేడు లో కా.ఫైళ్ళ మల్లారెడ్డి స్మారక స్థూపం,ఉరుమడ్ల లో కా.గుత్తా సీతారాం రెడ్డి,చిన్న కాపర్తి అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ జండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, మండల నాయకులు కత్తుల లింగస్వామి, నారబోయిన శ్రీనివాసులు,ఐతరాజు నర్సింహ, శీలా రాజయ్య,రుద్రారపు పెద్దులు, తదితరులు పాల్గొన్నారు.
వేలిమినేడు గ్రామకమిటీ ఆధ్వర్యంలో..
కమ్యూనిస్టుల పోరాటం వల్లే నిజాం లొంగుబాటు జరిగిందని సీపీఐ(ఎం) చిట్యాల మండల కమిటీ సభ్యులు నెలికంటి నరసింహ, పంది నరేష్‌లు అన్నారు. శనివారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా వెలిమినేడులో పైళ్ల మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళిలార్పించి మాట్లాడారు. ముందుగా సీపీఐ(ఎం) ఆఫీస్ పై జాతీయ జెండాను ఎంపీటీసీ దేశబోయిన నరసింహ, పార్టీ పతాకాన్ని పార్టీ కార్యదర్శి పంది నరేష్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరూరి షంబయ్య, నాతి వెంకటరామయ్య, ఏడుకొండల బసవయ్య, గడ్డం నర్సిరెడ్డి, గడ్డం చంద్రారెడ్డి, మేడి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.