Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
విశ్వకర్మ యజ్ఞం మహౌత్సవం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్రోడ్డు ఉన్న విశ్వకర్మ భవన్లో శనివారం కన్నుల పండుగల నిర్వహించారు. శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పూజల్లో పాల్గొని మాట్లాడారు. లోక కల్యాణం కోసం ప్రతి ఏటా యజ్ఞం నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. కమిటిహల్ ముందు ఆచార్య జయశంకర్, కసోజు శ్రీకాంతచారి విగ్రహాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో వారిని శాలువాలతో సన్మానించి సత్కారాలను అందజేశారు. అనంతరం అన్నదాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు గుంటోజు బ్రహ్మచారి, పెరికేటి వెంకటాచారి, యజ్ఞ కమిటీ కోశాధికారి రథం మురళీధర్ఆచారి, నాయకులు కాసోజు విశ్వనాథం, కొల్లోజు సత్యనారాయణ చారి, తదితరులున్నారు.