Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గుర్రాల కృష్ణయ్య భార్య గుర్రాల రాములమ్మ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. నాంపల్లి ఎంపిపి ఏడుదొడ్ల శ్వేత రవిందర్ రెడ్డి శనివారం మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పంపిన పదివేల రూపాయల ఆర్దిక సహాయాన్ని ఆమె అందించారు. రాములమ్మ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సర్పంచ్ జిల్లెల్ల యాదమ్మ సైదులు, గ్రామశాఖ అధ్యక్షులు నాంపల్లి నాగరాజు, గ్రామ రైతుబంధు కన్వీనర్ సూదనబోయిన పర్వతాలు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒంటెద్దు సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.